కొడంగల్ నుంచి కాంగ్రెస్‌కు 50వేల మెజార్టీ ఇవ్వాలి: సీఎం రేవంత్
తాను ఎక్కడ ఉన్నా ఒక కన్ను కొడంగల్ పైనే ఉంటుందని సీఎం రేవంత్‌రెడ్డి చెప్పారు.
By Srikanth Gundamalla Published on 28 March 2024 5:15 PM ISTకొడంగల్ నుంచి కాంగ్రెస్‌కు 50వేల మెజార్టీ ఇవ్వాలి: సీఎం రేవంత్
ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉపఎన్నిక పోలింగ్ గురువారం జరిగింది. ఈ క్రమంలోనే పోలింగ్‌లో కొండగల్ ఎంపీడీవో కార్యాలయంలో సీఎం రేవంత్‌రెడ్డి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ కేంద్రంలో మొత్తం 56 మంది ఓటర్లు ఉన్నారు. మంత్రి జూపల్లి కూడా తన హక్కును వినియోగించుకున్నారు.
ఓటు హక్కును వినియోగించుకున్న తర్వాత మాట్లాడిన సీఎం రేవంత్‌రెడ్డి.. కొడంగల్ నియోజకవర్గాన్ని ఉద్దేశించి పలు కామెంట్స్ చేశారు. తాను ఎక్కడ ఉన్నా ఒక కన్ను కొడంగల్ పైనే ఉంటుందని ఆయన చెప్పారు. నియోజకవర్గానికి పరిశ్రమలను తీసుకొచ్చి అభివృద్ధి చేస్తానని అన్నారు. కొడంగల్‌లోని తన నివాసం వద్ద అభిఆనులు, కార్యకర్తలతో సమావేశం అయ్యిన సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేశారు. త్వరలోనే పార్లమెంట్ ఎన్నికలు జరగనున్నాయి. పార్లమెంట్ ఎన్నికల్లో కొడంగల్ నుంచి కాంగ్రెస్‌కు 50వేల మెజార్టీ ఇవ్వాలని సీఎం రేవంత్‌రెడ్డి కోరారు.
ఎన్నికలు వస్తే సెలవులు వస్తాయనీ.. తీర్థయాత్రలకు వెళ్దామని కొందరు అనుకుంటారని సీఎం రేవంత్‌రెడ్డి చెప్పారు. అయితే.. ఓటు చాలా విలువైనదని ఆయన పేర్కొన్నారు. ఎన్ని కార్యక్రమాలు ఉన్నా.. ఓటు వేసేందుకు కొడంగల్ వచ్చానని చెప్పారు. తాను కష్టాల్లో ఉన్నప్పుడు ప్రజలు తన వెంటే ఉన్నారనీ.. ప్రచారానికి రాకపోయినా గెలిపించారని గుర్తు చేసుకున్నారు. అయితే.. కొడంగల్‌కు సిమెంట్ పరిశ్రమ రాబోతుందనీ.. పరిశ్రమలు వస్తే భూముల ధరలు పెరుగతాయని చెప్పారు. అంతేకాదు..ఫార్మా కంపెనీల ద్వారా యువతకు ఉపాధి దొరకుతుందని సీఎం రేవంత్‌రెడ్డి చెప్పారు. ఇక ఏప్రిల్ 6న తుక్కుగూడ కాంగ్రెస్ బహిరంగ సభను విజయవంతం చేయాలని సీఎం రేవంత్‌రెడ్డి పిలుపునిచ్చారు.