సీఎస్ సోమేశ్‌కుమార్ ఇంట తీవ్ర విషాదం

Telangana Chief Secretary Somesh Kumar mother passed away.రాష్ట్ర ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి సోమేశ్‌కుమార్ ఇంట తీవ్ర

By తోట‌ వంశీ కుమార్‌  Published on  5 April 2022 3:33 AM GMT
సీఎస్ సోమేశ్‌కుమార్ ఇంట తీవ్ర విషాదం

రాష్ట్ర ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి సోమేశ్‌కుమార్ ఇంట తీవ్ర విషాదం నెల‌కొంది. ఆయ‌న త‌ల్లి మీనాక్షి సింగ్ క‌న్నుమూశారు. గ‌త కొంత కాలంగా అనారోగ్యంతో బాధ‌ప‌డుతున్న ఆమె హైద‌రాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతున్నారు. సోమ‌వారం రాత్రి ఆమె ప‌రిస్థితి విష‌మించ‌డంతో తుదిశ్వాస విడిచారు. ఆమె వ‌య‌స్సు 85 సంవ‌త్స‌రాలు. ఆమె అంత్య‌క్రియ‌లు స్వ‌స్థ‌మైన బిహార్ రాష్ట్రంలోని ప‌ట్నాలో జ‌ర‌నున్నాయి.

మీనాక్షి సింగ్‌ మృతిపై సీఎం కేసీఆర్‌ సంతాపం తెలియ‌జేశారు. సీఎస్‌ను ఫోన్‌లో పరామర్శించి ఓదార్చారు.సీఎస్‌ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు. అలాగే మంత్రులు కేటీఆర్‌, హ‌రీశ్‌రావు, కొప్పుల ఈశ్వ‌ర్‌, తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌, సత్యవతి రాథోడ్‌, ఎర్రబెల్లి దయాకర్‌రావు త‌దిత‌రులు సంతాపం వ్య‌క్తం చేశారు.

Next Story
Share it