వరంగల్-ఖమ్మం-నల్గొండ ఎమ్మెల్సీ ఎన్నిక‌.. అధికారుల‌తో సీఈవో కీల‌క‌ స‌మావేశం

వరంగల్-ఖమ్మం-నల్గొండ (పూర్వపు) పట్టభద్రుల శాసనమండ‌లి నియోజకవర్గం పరిధిలోని 12 జిల్లాల డీఈవోలు, ఎస్పీ/సీపీలతో మే 27న ఎన్నికల నిర్వహణ సన్నద్ధతను తెలంగాణ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈవో) వికాస్ రాజ్ బుధవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు

By M.S.R
Published on : 23 May 2024 6:30 AM

వరంగల్-ఖమ్మం-నల్గొండ ఎమ్మెల్సీ ఎన్నిక‌.. అధికారుల‌తో సీఈవో కీల‌క‌ స‌మావేశం

వరంగల్-ఖమ్మం-నల్గొండ (పూర్వపు) పట్టభద్రుల శాసనమండ‌లి నియోజకవర్గం పరిధిలోని 12 జిల్లాల డీఈవోలు, ఎస్పీ/సీపీలతో మే 27న ఎన్నికల నిర్వహణ సన్నద్ధతను తెలంగాణ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈవో) వికాస్ రాజ్ బుధవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. రిటర్నింగ్ అధికారి ఇతర అధికారులతో మాట్లాడుతూ.. బ్యాలెట్ బాక్సులు మరియు బ్యాలెట్ పేపర్ల లభ్యతతో సహా సన్నాహకాల గురించి అడిగి తెలుసుకున్నారు. ఓటర్ల ప్రాధాన్యతలను గుర్తించేందుకు అవసరమైన అన్నీ సిద్ధంగా ఉన్నాయని జిల్లా అధికారులు తెలిపారు. రాష్ట్రంలో వేడిగాలులు వీస్తున్న దృష్ట్యా అన్ని బూత్‌ల వద్ద తాగునీరు, నీడలు తదితర సౌకర్యాలు కల్పించేందుకు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సీఈవో కోరారు.

ఎన్నికల ప్రక్రియలో, ముఖ్యంగా బ్యాలెట్ పేపర్లు, ఇతర పోలింగ్ సామగ్రిని అవసరమైన స్థాయిలో రవాణా చేసేటప్పుడు వర్షాలు పడే అవకాశం ఉంటుందని.. అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని కూడా CEO ఆదేశించారు. శాంతిభద్రతల సమస్యలు తలెత్తకుండా చూసుకోవాలని అన్నారు. పోలింగ్ కేంద్రాలు, స్ట్రాంగ్ రూమ్‌లు, పోలింగ్ బ్యాలెట్ల రవాణా వద్ద అవసరమైన భద్రతా ఏర్పాట్లు చేయాలని ఎస్పీలు & సీపీలను ఆయన కోరారు.

Next Story