రేపు తెలంగాణ కేబినెట్ అత్యవసర సమావేశం.. లాక్‌డౌన్‌పై నిర్ణయం
Telangana Cabinate Meet. సీఎం కేసీఆర్ అధ్యక్షతన ప్రగతి భవన్ లో మంగళవారం మధ్యాహ్నం 2 గంటలకు క్యాబినెట్
By Medi Samrat Published on
10 May 2021 5:03 PM GMT

సీఎం కేసీఆర్ అధ్యక్షతన ప్రగతి భవన్ లో మంగళవారం మధ్యాహ్నం 2 గంటలకు క్యాబినెట్ సమావేశం జరగనున్నది. రోజు రోజుకూ కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో.. రాష్ట్రంలో లాక్ డౌన్ విధింపుపై క్యాబినెట్ భేటీలో చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు. కొన్ని రాష్ట్రాల్లో లాక్ డౌన్ విధించినా కూడా కరోనా అంతగా తగ్గడంలేదని, సరియైన ఫలితాలు లేవని రిపోర్టులు అందుతున్నవి.
ఈ నేపథ్యంలో లాక్ డౌన్ విధింపు పై భిన్నాభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి. కొన్ని వర్గాలు లాక్ డౌన్ కావాలని కోరుకుంటున్న పరిస్థితి కూడా వున్నది. ఈ పరిస్థితుల్లో లాక్ డౌన్ విధించడం వల్ల కలిగే సాదకబాదకాలతో పాటు, రాష్ట్రంలో కొనసాగుతున్న ధాన్యం కొనుగోల్ల ప్రక్రియ మీద లాక్ డౌన్ ప్రభావం ఏమేరకు ఉంటుందనే అంశంపై క్యాబినెట్ చర్చించి నిర్ణయం తీసుకోనున్నది.
Next Story