ఫోర్బ్స్ ఇండియా డిజిటల్ స్టార్‌గా తెలంగాణ కుర్రాడు

Telangana boy named in Forbes India Digital Star List. యూట్యూబర్, సయ్యద్ హఫీజ్.. ప్రముఖ వ్యాపార పత్రిక ఫోర్బ్స్ ఇండియాలో చోటు దక్కించుకున్నాడు. ఫోర్బ్స్ ఇండియా ప్రకటించిన

By అంజి  Published on  24 July 2022 12:59 PM IST
ఫోర్బ్స్ ఇండియా డిజిటల్ స్టార్‌గా తెలంగాణ కుర్రాడు

యూట్యూబర్, సయ్యద్ హఫీజ్.. ప్రముఖ వ్యాపార పత్రిక ఫోర్బ్స్ ఇండియాలో చోటు దక్కించుకున్నాడు. ఫోర్బ్స్ ఇండియా ప్రకటించిన 'టాప్ 100 డిజిటల్ స్టోర్స్'లో హఫీజ్ యూట్యూబ్ ఛానెల్ 'తెలుగు టెక్ ట్యూట్స్‌'కు 16 లక్షల మంది సబ్‌స్క్రైబర్లను దాటడంతో 32వ స్థానంలో నిలిచాడు. గోదావరిఖనిలోని ఎయిట్ ఇంక్లైన్ కాలనీకి చెందిన హఫీజ్ కంప్యూటర్ సెంటర్ నడుపుతూ 2011లో యూట్యూబ్ ఛానెల్ తెలుగు టెక్ ట్యూట్స్‌ను ప్రారంభించాడు.

మొబైల్ ఫోన్ల గురించి వివరించడంతో పాటు వివిధ కంపెనీలు తీసుకొచ్చే కొత్త మొబైల్ ఫోన్లను అన్‌బాక్సింగ్ చేయడం, వాటి ఫ్యూచర్స్, లాభ నష్టాలు, కొత్త ఎలక్ట్రానిక్ వస్తువులను లాంచ్ చేయడం వంటి అంశాలను హఫీజ్ తన ఛానెల్‌లో వీడియో పోస్ట్ చేయడం ద్వారా వివరించారు. హఫీజ్ తన ఛానెల్ 16 లక్షల మంది సబ్‌స్క్రైబర్‌ల ద్వారా నెలకు దాదాపు రూ. 2 లక్షలు సంపాదిస్తున్నాడు. హఫీజ్‌ వీడియోలను ఇప్పటి వరకు 17.2 కోట్ల మంది వీక్షించారు. అలాగే ఆయన వీడియోలకు 99.4 శాతం కచ్చితత్వం, వాస్తవికత ఉండడంతో ఫోర్బ్స్ ఇండియా హఫీజ్‌ ఛానెల్‌కు 32వ స్థానాన్ని ఇచ్చింది. సింగరేణి ఉద్యోగి కుమారుడైన హఫీజ్ ఉన్నత చదువులు చదవకున్నా.. సాంకేతిక పరిజ్ఞానంతో ప్రజలను ఆకర్షిస్తున్నాడు.

డిజిటల్ స్టార్స్ ఎంపిక కోసం యూట్యూబ్, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌లో హాస్యం, అందం, ఫ్యాషన్, వ్యాపారం-ఆర్థికం, ఫిట్‌నెస్, ఫుడ్, టెక్, ట్రావెల్, సామాజిక సేవ కేటగిరీల్లో ఎక్కువమంది ఫాలోవర్లు ఉన్న వారిని ఎంపిక చేశారు. 'ముంబైకార్' పేరుతో యూట్యూబ్ ఛానెల్ నిర్వహిస్తున్న ముంబైకి చెందిన నిఖిల్ శర్మ ఈ జాబితాలో మొదటి సంపాదించుకున్నాడు. వేర్వేరు కేటగిరీల్లో నటాషా నోయెల్, ఆశిష్ చంచ్లానీలు టాప్‌లో నిలిచారు. అలాగే, ఇద్దరు ట్రాన్స్‌జెండర్లకు టాప్-100లో ఉన్నారు.

Next Story