Telangana: చర్చి కాంపౌండ్‌ వాల్‌ను కూల్చిన బీజేపీ కార్యకర్తలు.. చెలరేగిన వివాదం

సిద్దిపేట జిల్లాలో చర్చి కాంపౌండ్ వాల్ కూల్చివేత చర్చనీయాంశంగా మారింది. కొండపాక మండలం సారపల్లిలో అసైన్డ్‌ స్థలాన్ని అక్రమంగా వేరొకరికి బదలాయించిన తర్వాత చర్చి నిర్మాణం చేపట్టారు.

By అంజి  Published on  30 Oct 2024 1:39 AM GMT
Telangana, BJP workers, church compound wall, assigned land

Telangana: చర్చి కాంపౌండ్‌ వాల్‌ను కూల్చిన బీజేపీ కార్యకర్తలు.. చెలరేగిన వివాదం

సిద్దిపేట జిల్లాలో చర్చి కాంపౌండ్ వాల్ కూల్చివేత చర్చనీయాంశంగా మారింది. కొండపాక మండలం సారపల్లిలో అసైన్డ్‌ స్థలాన్ని అక్రమంగా వేరొకరికి బదలాయించిన తర్వాత చర్చి నిర్మాణం చేపట్టారు. ఈ క్రమంలోనే చర్చి నిర్మాణదారులకు, గ్రామంలోని బీజేపీ కార్యకర్తలకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ విషయమై విచారణ నిమిత్తం బీజేపీ కార్యకర్తలను కుకునూర్‌పల్లి పీఎస్‌కు పిలిపించారు పోలీసులు. అనంతరం వారిని రిమాండ్‌ చేయాలని ప్రయత్నించారు.

విషయం తెలుసుకున్న మెదక్‌ ఎంపీ రఘునందన్‌ రావు వెంటనే పోలీస్‌స్టేషన్‌కు వెళ్లారు. రఘునందన్ రావు తెలిపిన వివరాల ప్రకారం, చర్చిలో కొంత భాగాన్ని కూల్చివేశారని ఆరోపిస్తూ అక్టోబర్ 28, సోమవారం నాడు కుకునూర్‌పల్లి పోలీస్ స్టేషన్‌లో ఎనిమిది మంది బిజెపి కార్యకర్తలను అరెస్టు చేసి, వారిపై దేశద్రోహం కేసులు నమోదు చేశారు.

‘‘ప్రభుత్వ భూముల్లో నిర్మించిన అక్రమ కట్టడాలను కూల్చివేయడానికి రాష్ట్ర ప్రభుత్వమే రంగనాథ్ అనే ఐపీఎస్ అధికారిని నియమించింది. మా కార్యకర్తలు అదే పని చేస్తే, వారి తప్పు ఏమిటి? ” అని మీడియాతో మాట్లాడుతూ ప్రశ్నించారు. బీజేపీ కార్యకర్తలను అరెస్టు చేసిన విషయం తెలుసుకున్న రఘునందన్ రావు సోమవారం రాత్రి పోలీస్ స్టేషన్‌కు వెళ్లారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రఘునందన్‌ రావు అక్కడ సీన్ క్రియేట్ చేశాడు. కుకునూర్‌పల్లి పోలీసులు మాట్లాడుతూ , ప్రశ్నార్థకమైన భూమిని అసైన్‌డ్ చేసిందని, అయితే చర్చి మినిస్ట్రీలతో సంబంధాలు ఉన్న హైదరాబాద్ నివాసి పేరుకు బదిలీ చేశారని చెప్పారు. అసైన్డ్ భూమిని విక్రయించేందుకు నోటరీ చేసిన పత్రాలు కూడా తయారు చేశారని, ఇది చట్టవిరుద్ధమని వారు తెలియజేశారు.

గ్రామంలో ఇప్పటికే రెండు చర్చిలు ఉన్నాయని, ఇది కూడా ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమంగా నిర్మిస్తున్న మూడో చర్చి అని గోడ కూల్చివేతదారులు వాదించారని పోలీసులు తెలిపారు. చర్చి నిర్మిస్తున్న కాలనీ దళితులకు చెందినది కాదని, ఆ ప్రాంతంలో ముదిరాజు సామాజికవర్గం ఎక్కువగా ఉందని పోలీసులు తెలిపారు.

చర్చి నిర్మాణానికి పంచాయతీ కార్యదర్శిగానీ, మండల రెవెన్యూ అధికారి నుంచి గానీ అనుమతి తీసుకోలేదని రఘునందన్‌రావు తెలిపారు. బీజేపీ కార్యకర్తలు పలుమార్లు ఫిర్యాదు చేసినా అసైన్డ్ భూమి ఆక్రమణదారులపై చర్యలు తీసుకోవడం లేదన్నారు.

చర్చి నిర్మాణంపై బీజేపీ న్యాయపోరాటం చేస్తుందన్నారు.

రఘునందన్‌రావు తన ఎంపీ పదవికి రాజీనామా చేసి ఇలా మాట్లాడారంటే అర్థం చేసుకోవచ్చు. అయితే బాధ్యతాయుతమైన పదవిలో ఉండి చర్చి కూల్చివేత గురించి మాట్లాడుతున్నందున ఆయన తక్షణమే రాజీనామా చేయాలి' అని దళిత బహుజన ఫ్రంట్ నాయకుడు శంకర్ పెద్దలింగన్నగారి అన్నారు .

Next Story