తెలంగాణలో బీజేపీకి సానుకూల వాతావరణం ఉంది: కిషన్‌రెడ్డి
తెలంగాణలో బీజేపీకి సానుకూల వాతావరణం కనిపిస్తోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి అన్నారు.
By Srikanth Gundamalla Published on 5 May 2024 1:01 PM ISTతెలంగాణలో బీజేపీకి సానుకూల వాతావరణం ఉంది: కిషన్‌రెడ్డి
తెలంగాణలో బీజేపీకి సానుకూల వాతావరణం కనిపిస్తోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి అన్నారు. తన జీవితంలో ఎప్పుడూ రాష్ట్రంలో ఇంతటి సానుకూల వాతావరణాన్నిచూడలేదని అన్నారు. బీజేపీ వైపే ప్రజలు నిలబడ్డారనీ.. మోదీ పాలనపట్ల సంతోషంగా ఉన్నారని కిషన్‌రెడ్డి అన్నారు. తెలంగాణలో రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ మెజార్టీ సీట్లలో గెలవబోతుందని జోస్యం చెప్పారు. అయితే.. ఇప్పుడొస్తున్న ఆదరణ గతంలో లేదని అన్నారు. దేశ భవిష్యత్ మరింత బాగుండాలనుకుంటే ప్రతి ఒక్కరూ బీజేపీకి ఓటు వేయాలని కిషన్‌రెడ్డి ఓటర్లను కోరారు.
ఎన్డీఏ ప్రభుత్వ పాలనలో ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉన్నారని కిషన్‌రెడ్డి చెప్పారు. కాంగ్రెస్ సుదీర్ఘకాలం పాటు కేంద్రంలో అధికారంలో ఉన్నా ప్రజలకు ఏం చేయలేకపోయిందన్నారు. వారు మొత్తం అవినీతి, కుంభకోణాలు చేయడంలోనే మునిగిపోయారని విమర్శించారు. దాంతో... కాంగ్రెస్ చేసిన అవినీతి వల్ల దేశ ప్రజలను గాయపర్చాయనీ.. అందుకే కాంగ్రెస్‌ను ఎవరూ దగ్గరకు కూడా రానివ్వడం లేదని అన్నారు. మరోసారి కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం రాబోతుందని కిషన్‌రెడ్డి దీమా వ్యక్తం చేశారు.
ప్రధాని నరేంద్ర మోదీ పాలనలో భారత్ ప్రపంచ దేశాల్లోనే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ గల దేశాల్లో ఐదో స్థానానికి ఎదిగిందని కిషన్‌రెడ్డి చెప్పారు. ఎవరూ ఊహించని రీతిలో బ్రిటన్ వంటి దేశాలను వెనక్కి నెట్టి ఆర్థికంగా బలపడిందని చెప్పారు. మోదీ పాలనలో ఇండియా మానుఫ్యాక్చరింగ్ హబ్‌గా మారబోతుందని చెప్పారు. మరోవైపు మహిళలకు కూడా బీజేపీ పెద్ద పీట వేస్తుందని చెప్పారు. మహిళా సాధికారత విషయంలో మోదీ సర్కార్ అన్ని చర్యలు తీసుకుందన్నారు. డిఫెన్స్‌తో పాటుగా అన్ని రంగాల్లో మహిళలను ప్రోత్సహిస్తున్నామని చెప్పారు. సైనిక స్కూళథ్లలో అడ్మిషన్లు కూడా ఇస్తున్నామని కిషన్‌రెడ్డి వెల్లడించారు. ముస్లిం మహిళల గౌరవాన్ని పెంచేలా త్రిపుల్ తలాక్‌ను రద్దు చేసిన ఘనత తమక బీజేపీ ప్రభుత్వానికే దక్కుతుందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు.