ఈ నెల 24వ తేదీ నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలకు డేట్ ఫిక్స్ అయ్యింది.
By Srikanth Gundamalla Published on 11 July 2024 3:33 PM ISTఈ నెల 24వ తేదీ నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలకు డేట్ ఫిక్స్ అయ్యింది. బడ్జెట్ సమావేశాలను జూలై 24వ తేదీ నుంచి ప్రారంభించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.ఈ మేరకు మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, అసెంబ్లీ స్పీకర్ ప్రసాదరావు రివ్యూ సమావేశం కూడా నిర్వహించారు.
జూలై 24 నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు మొదలు కానున్నాయి. అసెంబ్లీ సమావేశాల నిర్వహణపై స్పీకర్ సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో ప్రభుత్వ విప్‌లు, సీఎస్, డీజీపీ, అధికారులు పాల్గొన్నారు. ప్రస్తుతం రైతు భరోసా విధివిధానాల ఖరారు కోసం ఏర్పాటు చేసిన కేబినెట్ సబ్ కమిటీ జిల్లాల్లో పర్యటిస్తోన్న విషయం తెలిసింది. ఈ సబ్ కమిటీ వివరాలను సేకరించి.. నివేదికను తయారు చేసిన తర్వాత అసెంబ్లీ చర్చలు జరుగుతున్నాయి. వీటిపై అసెంబ్లీలో సుదీర్ఘ చర్చ కొనసాగుతుంది. అలాగే పూర్తిస్థాయి బడ్జెట్‌ను కూడా అసెంబ్లీ సమావేశాల్లో ప్రవేశపెట్టాలని కాంగ్రెస్ ప్రభుత్వం ఆలోచిస్తోంది.
ఈ అసెంబ్లీ సమావేశాల ద్వారా పలు కీలక ప్రకటనలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. జాబ్ క్యాలెండర్‌ను సైతం ప్రకటించే చాన్ ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. గతంలో అసెంబ్లీ సమావేశాలకు బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ హాజరుకాలేదు. ఈసారి అసెంబ్లీ సమావేశాల్లో ఆ యన పాల్గొనే చాన్సెస్ ఉన్నాయి. కాంగ్రెస్‌లో వరుసగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు చేరారు..ఈ క్రమంలో ఉభయ సభల్లో వాగ్వివాదాలు జరిగే అవకాశాలు ఉన్నాయని పలువురు రాజకీయ నిపుణులు అంటున్నారు. ఇక కాంగ్రెస్ ఇచ్చిన హామీలపై బీఆర్ఎస్ అసెంబ్లీ వేదికగా గట్టిగా నిలదీయనుంది.