హైదరాబాద్‌లో అధిక స్థానాల్లో లీడింగ్‌లో బీఆర్ఎస్
తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది.
By Srikanth Gundamalla Published on 3 Dec 2023 11:35 AM ISTహైదరాబాద్‌లో అధిక స్థానాల్లో లీడింగ్‌లో బీఆర్ఎస్
తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. ప్రస్తుతం కౌంటింగ్‌లో కాంగ్రెస్ హవా కొనసాగుతోంది. 65కి పైగా స్థానల్లో కాంగ్రెస్ అభ్యర్థులు లీడింగ్‌లో కొనసాగుతున్నారు. ఎగ్జిట్ పోల్స్‌ను నిజం చేస్తూ ఇప్పటి వరకు వచ్చిన ఫలితాలు ఉన్నాయి. అయితే.. ఇంకా కౌంటింగ్ కొనసాగుతూ ఉంది. నల్లగొండ, ఖమ్మం జిల్లాల్లో ఎక్కువ స్థానాల్లో కాంగ్రెస్ కొనసాగుతోంది. మరోవైపు బీఆర్ఎస్ మంత్రులకు సైతం పలుచోట్ల షాక్ తప్పలేదు. ఈ క్రమంలో హైదరాబాద్‌లో మాత్రం బీఆర్ఎస్ అధిక స్థానాల్లో లీడింగ్‌లో కొనసాగుతుంది. ఎంఐఎం నాలుగు చోట్ల లీడింగ్‌లో ఉంది.. కాంగ్రెస్ మూడు స్థానాల్లో.. బీజేపీ ఒక చోట ముందంజలో ఉంది.
హైదరాబాద్ పరిధిలోని ఆయా నియోజకవర్గాల్లో ఆధిక్యంలో ఉన్న బీఆర్ఎస్ అభ్యర్థుల వివరాలు... శేరిలింగంపల్లి నుంచి అరికెపూడి గాంధీ, కూకట్‌పల్లి నుంచి మాధవరం కృష్ణారావు, సనత్‌నగర్ నుంచి తలసాని శ్రీనివాస్, కుత్బుల్లాపూర్ నుంచి వివేకానంద్ లీడింగ్‌లో ఉన్నారు. అలాగే ముషీరాబాద్ నుంచి ముఠా గోపాల్, జూబ్లీహిల్స్ నుంచి మాగంటి గోపీనాథ్, కంటోన్మెంట్ నుంచి లాస్య నందిత, సికింద్రాబాద్ నుంచి పద్మారావు, ఉప్పల్ నుంచి లక్ష్మారెడ్డి, గోషామహల్ నుంచి నందకిశోర్ వ్యాస్ బిలాల్, ఖైరతాబాద్ నుంచి దానం నాగేందర్ లీడింగ్‌లో కొనసాగుతున్నారు. ఎల్బీనగర్ నుంచి దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి, మేడ్చల్ నుంచి మల్లారెడ్డి, మల్కాజిగిరి నుంచి రాజశేఖర్‌రెడ్డి ఆధిక్యంలో కొనసాగుతున్నారు.
హైదరాబాద్ పరిధిలో లీడింగ్‌లో ఉన్న కాంగ్రెస్ అభ్యర్థులు.. నాంపల్లి నుంచి ఫిరోజ్‌ఖాన్, పటాన్‌చెరు నుంచి కాట శ్రీనివాస్‌గౌడ్, ఇబ్రహీంపట్నం నుంచి మల్‌రెడ్డి రంగారెడ్డి ముందంజలో ఉన్నారు. అలాగే ఎంఐఎం అభ్యర్థుల వివరాలు చూస్తే.. కార్వాన్ నుంచి కౌసర్ మోహియుద్దీన్, చాంద్రాయణగుట్ట నుంచి అక్బరుద్దీన్ ఓవైసీ, మలక్‌పేట్ నుంచి అహ్మద్ బిన్ అబ్దుల్లా బలాలా, చార్మినార్ నుంచి జుల్ఫీకర్ అలీ ఆధిక్యంలో ఉన్నారు. యాకుత్‌పురాలో వీరేంద్రయాదవ్ బీజేపీ అభ్యర్థి లీడింగ్‌లో ఉన్నారు.