అసెంబ్లీలో ప్రతిపక్ష నేతలకు సీఎం రేవంత్‌ స్ట్రాంగ్ కౌంటర్

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నాయి.

By Srikanth Gundamalla  Published on  16 Dec 2023 1:56 PM IST
telangana, assembly, cm revanth,  brs ,

అసెంబ్లీలో ప్రతిపక్ష నేతలకు సీఎం రేవంత్‌ స్ట్రాంగ్ కౌంటర్

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నాయి. కాంగ్రెస్ పాలనపై బీఆర్ఎస్ నాయకులు తీవ్ర విమర్శలు చేశారు. ఈక్రమంలో స్పందించిన సీఎం రేవంత్‌రెడ్డి వారికి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. పదేపదే గత పాలన గురించి ప్రతిపక్ష సభ్యులు మాట్లాడుతున్నారనీ.. అప్పటి ప్రభుత్వంలో మీదే ప్రధాన భాగస్వామ్యం కదా అని గుర్తు చేశారు. అప్పడు జరిగింది అన్నీ పాపాలే అయితే.. వాటికి పూర్తి బాధ్యత మీదేనంటూ కౌంటర్ ఇచ్చారు రేవంత్‌రెడ్డి. మాట్లాడితే గత పాలన గురించి చెప్పడం సమంజసం కాదని చెప్పారు. కేసీఆర్‌కు రాజకీయంగా అవకాశాలు ఇచ్చిందే కాంగ్రెస్‌ పార్టీ అని.. పార్టీ యువజన సంఘం వైస్‌ ప్రెసిడెంట్‌.. ఆ తర్వాత ఎంపీ.. మంత్రిగా కూడా కేసీఆర్ పనిచేసేందుకు అవకాశం ఇచ్చింది కాంగ్రెస్సే అని సీఎం రేవంత్‌రెడ్డి గుర్తు చేశార.

ప్రస్తుతం పాలకపక్షంలో ఉన్న నేతలకంటే ప్రతిపక్ష సభ్యులే గత ప్రభుత్వాల్లో కీలకంగా వ్యవహరించారని రేవంత్‌రెడ్డి అన్నారు. పోతిరెడ్డిపాడుకి గండి పెట్టి నీళ్లు తరలించినప్పుడు ఇక్కడ ఇప్పుడున్న ప్రతిపక్ష నేతలు ఎవ్వరూ మాట్లాడలేదన్నారు రేవంత్. కీర్తిశేషులు నాయిని నర్సింహారావు అప్పట్లో కడప ఇంచార్జ్‌గా ఉన్నారని చెప్పారు. పొత్తిరెడ్డిపాడు విషయం కొట్లాడింది ఏకైక వ్యక్తి పి.జనార్ధన్‌రెడ్డి అని రేవంత్‌రెడ్డి వివరించారు. తెలంగాణ ప్రాంతానికి అన్యాయం జరగనీయొద్దు అని.. కృష్ణా జలాల్లో వాటా కోసం పీజేఆర్ సొంత పార్టీపై.. సొంత ప్రభుత్వంపై కొట్లాడారని సీఎం రేవంత్‌రెడ్డి గుర్తు చేశారు.

తెలంగాణ ఏర్పడిన తర్వాత పదేళ్ల పాటు పాలించిన ప్రభుత్వం ఏం చేసిందని ప్రశ్నించారు సీఎం రేవంత్‌రెడ్డి. ఆర్థిక విధ్వంసం ఎలా జరిగిందని నిలదీశారు. పదేళ్ల బీఆర్ఎస్‌ పాలనపై సంపూ్ణంగా చర్చిద్దామని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. తెలంగాణ అభివీవృద్ధి కోరుకుంటు కాంగ్రెస్ పాలనకు సంబంధించిన విజయన్‌ డాక్యుమెంట్ చదవిన గవర్నర్ ప్రసంగానికి అభినందనలు తెలపాలని రేవంత్‌రెడ్డి అన్నారు. ప్రతిపక్షాలను గౌరవించే సంప్రదాయం కాంగ్రెస్‌కు ఉందని.. ప్రభుత్వం కూడా ఇది కొనసాగిస్తుందని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు.

Next Story