తెలంగాణ అసెంబ్లీలో ఆరు బిల్లులకు ఆమోదం.. హరిత నిధి కూడా..!
Telangana Assembly. హరితహారాన్ని మరింత సమర్థవంతంగా నిర్వహించేందుకు ప్రత్యేకంగా హరిత నిధిని
By Medi Samrat Published on 1 Oct 2021 1:48 PM GMT
హరితహారాన్ని మరింత సమర్థవంతంగా నిర్వహించేందుకు ప్రత్యేకంగా హరిత నిధిని ఏర్పాటు చేస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీలో చెప్పుకొచ్చారు. పచ్చదనాన్ని పెంచడాన్ని ప్రతి ఒక్కరూ బాధ్యతగా తీసుకోవాలని.. హరిత నిధికి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీల జీతాల నుంచి నెలకు రూ. 500, ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ అధికారులు రూ. 100, ప్రతి ప్రభుత్వ ఉద్యోగి రూ. 25 ఇవ్వాలని కోరారు. ఇక రిజిస్ట్రేషన్లు, భవనాల అనుమతులు, వాహన రిజిస్ట్రేషన్ల సమయంలో కొంత మొత్తాన్ని వసూలు చేయాలని చెప్పారు. విద్యార్థుల అడ్మిషన్ల సమయంలో ఐదు రూపాయలు తీసుకోవాలని తెలిపారు. దీంతో పాటు వ్యక్తులు, సంస్థల నుంచి విరాళాలను సేకరించాలని చెప్పారు.
ఎనిమిది బిల్లులు అసెంబ్లీలో ఆమోదం పొందాయి. అవి ఇవే:
తెలంగాణ జీఎస్టీ సవరణ బిల్లు 2021,
తెలంగాణ స్టేట్ ప్రివెన్షన్ ఆఫ్ మాల్ప్రాక్టీస్ అగైనెస్ట్ టూరిస్ట్ అండ్ ట్రావెలర్స్ బిల్ 2021,
తెలంగాణ హౌసింగ్ బోర్డు సవరణ బిల్లు 2021,
కొండా లక్ష్మణ్ బాపూజీ, తెలంగాణ హార్టికల్చర్ యూనివర్శిటీ సవరణ బిల్లు
ది నేషనల్ అకాడెమీ ఆఫ్ లీగల్ స్టడీస్ అండ్ రీసర్చ్ యూనివర్శిటీ బిల్లు
తెలంగాణ పంచాయతీరాజ్ సవరణ బిల్లు