Telangana: విద్యార్థులకు గుడ్‌న్యూస్..13 రోజులు దసరా సెలవులు
తెలంగాణలోని పాఠశాల విద్యార్థులకు ప్రభుత్వం తీపికబురు అందించింది
By Knakam Karthik
Telangana: విద్యార్థులకు గుడ్‌న్యూస్..13 రోజులు దసరా సెలవులు
తెలంగాణలోని పాఠశాల విద్యార్థులకు ప్రభుత్వం తీపికబురు అందించింది. రాష్ట్రంలోని పాఠశాల విద్యార్థులు, ఉపాధ్యాయులు సెప్టెంబర్ 21 నుండి ప్రారంభమయ్యే దసరా సెలవులను సెలవులు తీసుకోవచ్చు. పాఠశాలలకు అక్టోబర్ 3 వరకు 13 రోజుల దసరా సెలవులు మంజూరు చేయబడ్డాయి. కాగా అక్టోబర్ 4న తిరిగి పాఠశాలలు పునఃప్రారంభం అవుతాయి. అయితే విద్యార్థులు అక్టోబర్ 4న అంటే శనివారం అయినందున పాఠశాలకు వెళ్లకపోతే, వారు తమ సెలవులను రెండు రోజులు పొడిగించి, అక్టోబర్ 6 సోమవారం పాఠశాలలకు వెళ్లే అవకాశం ఉంది.
కాగా జూనియర్ కళాశాలలకు అక్టోబర్ 5 వరకు ఆదివారాలు సహా ఎనిమిది రోజుల సెలవులు అనౌన్స్ చేశారు. అక్టోబర్ 6న తిరిగి కాలేజీలు తెరవనున్నారు. నవంబర్ 10 నుండి 15 వరకు విద్యార్థులకు అర్ధ వార్షిక పరీక్షలు ఉంటాయి. అయితే సెలవులకు ముందు, పాఠశాలలు తమ నిర్మాణాత్మక మూల్యాంకనం (FA)- 2 పరీక్షలను ముగించాలి. దసరా తర్వాత పాఠశాలలు ప్రారంభం అయిన తర్వాత, విద్యార్థులు అక్టోబర్ 24 నుండి 31 వరకు సంగ్రహణాత్మక మూల్యాంకనం (SA) - 1 పరీక్షలను రాయాలి. సమాధాన పత్రాల మూల్యాంకనం తర్వాత, నవంబర్ 6 నాటికి SA 1 ఫలితాలు ప్రకటించబడతాయి. SA 1 పూర్తయిన తర్వాత, బోధన తప్ప నవంబర్ నెలలో ఎటువంటి పరీక్షలు ఉండదు.