తెలంగాణలో అంగన్వాడీలకు రిటైర్మెంట్ ప్రయోజనాలు
తెలంగాణ ప్రభుత్వం అంగన్వాడీలకు గుడ్‌న్యూస్ చెప్పింది.
By Srikanth Gundamalla Published on 16 July 2024 12:12 PM ISTతెలంగాణలో అంగన్వాడీలకు రిటైర్మెంట్ ప్రయోజనాలు
తెలంగాణ ప్రభుత్వం అంగన్వాడీలకు గుడ్‌న్యూస్ చెప్పింది. అంగన్వాడీలకు రిటైర్మెంట్ ప్రయోజనాలు అందిస్తామని వెల్లడించింది. ఈ మేరకు మంత్రి సీతక్క ప్రకటన చేశారు. హైదరాబాద్ నగరంలోని రహమత్‌నగర్‌లో 'అమ్మ మాట-అంగన్వాడీ బాట' కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆమె.. అంగన్వాడీలకు రిటైర్మెంట్ ప్రయోజనాలను చేకూరుస్తామని వెల్లడించారు. అంగన్వాడీ టీచర్‌కు రూ.2లక్షలు, హెల్పర్‌కు రూ.లక్ష చొప్పున రిటైర్మెంట్ బెనిఫిట్ అందిస్తామని మంత్రి సీతక్క ప్రకటించారు. ఇక త్వరలోనే దీనిపై జీవో కూడా జారీ చేస్తామని మంత్రి సీతక్క చెప్పారు.
రాగాజజ అంగన్వాడీలకు బెనిఫిట్స్ ఇవ్వాలంటూ గత కొద్దిరోజులు ఆందోళనలు చేస్తున్నారు. సోమవారం రాష్ట్రంలోని పలు చోట్ల ర్యాలీలు, ధర్నాలు, ఎమ్మెల్యే క్యాంపు ఆఫీసుల ముట్టడి కార్యక్రమాలు చేపట్టారు. ప్రజాప్రతినిధులకు వినతిపత్రాలను కూడా అందించారు. అంగన్వాడీల రిటైమర్మెంట్ బెనిఫిట్స్ పెంచి టీచర్లకు రూ.2లక్షలు, ఆయాలకు రూ.లక్ష ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు అంగన్వాడీల ఆందోళనలపై స్పందించిన ప్రభుత్వం తాజాగా ఈ నిర్ణయం తీసుకుంది. అంగన్వాడీలకు రిటైర్మెంట్ ప్రయోజనాలను చేకూరుస్తామని మంత్రి సీతక్క వెల్లడించారు. కాగా.. ప్రభుత్వ ప్రకటనతో అంగన్వాడీలు ఈ నెల 19న చేపట్టిన ఆందోళనలు, నిరసన కార్యక్రమాల నుంచి వెనక్కి తగ్గనున్నారు.