హైదరాబాద్: టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (టెట్) దరఖాస్తుల్లో తప్పుల సవరణకు ప్రభుత్వం అవకాశం కల్పించింది. ఇవాళ్టి నుంచి ఈ నెల 22 వరకు పాఠశాల విద్యాశాఖ వెబ్‌సైట్‌లో అభ్యర్థులు తమ దరఖాస్తులను ఎడిట్ చేసుకోవచ్చు. మరోవైపు దరఖాస్తు గడువు ఈ నెల 20తో ముగియనుంది. ఇప్పటి వరకూ సుమారు లక్షన్నర దరఖాస్తులు వచ్చినట్టు సమాచారం. www.schooledu.telangana.gov.in అనే వెబ్‌సైట్ ద్వారా ఎడిట్ చేసుకోవచ్చు.
ఏవైనా టెక్నికల్ సమస్యలు వస్తే 7032901383, 9000756178 నంబర్లలో సంప్రదించాలని అధికారులు సూచించారు. దరఖాస్తులకు చివరి తేదీ నవంబర్ 20. అటు ఈ సంవత్సరం మేలో నిర్వహించిన టెట్‌కు హాజరై, అర్హత సాధించని వారికి ఫ్రీగా అప్లికేషన్ పెట్టుకునేందుకు ఛాన్స్ కల్పించింది. డిసెంబర్ 26 నుంచి హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకునే అవకాశముంది. 2025 జనవరి 1 నుంచి 20 వరకు టెట్ పరీక్ష లను ఆన్‌లైన్‌లో నిర్వహిస్తారు. ఫిబ్రవరి 5న టెట్ ఫలితాలను విడుదల చేస్తారు.