హన్మకొండ జిల్లా అడిషనల్ కలెక్టర్ ఇంట్లో ఏసీబీ సోదాలు

హన్మకొండ అదనపు కలెక్టర్ వెంకట్ రెడ్డి ఆదాయానికి మించిన ఆస్తులు కూడ బెట్టినట్లు వచ్చిన ఆరోపణల రావడంతో అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు సోదాలు నిర్వహించారు.

By -  అంజి
Published on : 21 Jan 2026 11:39 AM IST

Telangana, ACB conducts searches, Hanamkonda Addl Collector Venkata Reddy, disproportionate assets allegations

హన్మకొండ జిల్లా అడిషనల్ కలెక్టర్ ఇంట్లో ఏసీబీ సోదాలు

హన్మకొండ అదనపు కలెక్టర్ వెంకట్ రెడ్డి ఆదాయానికి మించిన ఆస్తులు కూడ బెట్టినట్లు వచ్చిన ఆరోపణల రావడంతో అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు సోదాలు నిర్వహించారు. వెంకట్ రెడ్డి నివాసంతో పాటు ఆయనకు సంబం ధించిన ఇతర ప్రాంతాల్లో కూడా తనిఖీలు కొనసాగుతున్నాయి. తెలంగాణ వ్యాప్తంగా మొత్తం పది చోట్ల సోదాలు జరుగుతున్నట్లు అధికారులు తెలిపారు.

హైదరాబాద్, నల్గొండ, మిర్యాలగూడ, హన్మకొండలోని ఇళ్లు, కార్యాలయాల్లో ఏసీబీ బృందాలు తనిఖీలు చేపట్టాయి. భారీగా నగదు, బంగారం, ఆస్తి పత్రాలు స్వాధీనం చేసుకున్నట్టు సమాచారం. పదవిని అడ్డం పెట్టుకొని వందల కోట్ల విలువైన ఆస్తులు సంపాదించినట్లు ఆరోపణలు ఉండటంతో మొదటి ఏసిబి అధికారులు ప్రాథమిక విచారణ జరిపి... అనంతరం అధికారి కలెక్టర్ ఆదాయానికి మించిన ఆస్తులు సంపాదించినట్లుగా గుర్తించి కేసు నమోదు చేసుకుని ఈ సోదాలు కొనసాగిస్తున్నారు.

సోదాల సందర్భంగా కీలక పత్రాలు, ఆర్థిక లావాదేవీల వివరాలను ఏసీబీ అధికారులు పరిశీలిస్తున్నారు. పూర్తి స్థాయి దర్యాప్తు అనంతరం తదుపరి చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు. డిసెంబర్ 2025లో, వెంకట్‌ రెడ్డి రూ.60,000 లంచం తీసుకుంటూ పట్టుబడ్డాడు. సస్పెండ్ చేయబడ్డాడు. దర్యాప్తు తర్వాత మంచిరేవులలో, ఇతర ప్రదేశాలలో అతని నివాసంలో దాడులు జరిగాయి. ఈ సమయంలో అధికారులు ₹30 లక్షల నగదు, కీలకమైన ఆస్తి పత్రాలను స్వాధీనం చేసుకున్నారు.

Next Story