హైదరాబాద్: ఎస్సీ వర్గీకరణపై మంత్రి వర్గ సబ్ కమిటీకి ఏకసభ్య కమిషన్ నివేదిక అందజేసింది. జస్టిస్ షమీమ్ అక్తర్ ఏకసభ్య కమిషన్ నివేదికను ఉపసంఘానికి సోమవారం అందించింది. 2011 జనాభా లెక్కల ప్రకారం.. 4 కేటగిరీలుగా విభజించాలని ప్రతిపాదించింది. మొదటి కేటగిరిలో అత్యంత వెనుకబడిన ఉప కులాలు, రెండో కేటగిరిలో మాదిగ, మాదిగ ఉప కులాలు, మూడో కేటగిరీలో మాల, మాల ఉప కులాలు, నాలుగో కేటగిరిలో ఇతర ఉప కులాలుగా విభజించాలని సూచించింది. సామాజిక, ఆర్థిక, విద్య, ఉద్యోగ, రాజకీయ రంగాల్లో వెనుకబాటు, ఇతర అంశాలను పరిగణనలోకి తీసుకుని నివేదికను రూపొందించినట్టు చెబుతున్నారు.
మరోవైపు ఎమ్మార్పీఎస్ చీఫ్ మందకృష్ణ మాదిగ కీలక వ్యాఖ్యలు చేశారు. రాబోయే రెండు మూడు రోజుల్లో ఏదైనా జరగవచ్చన్నారు. ఎస్సీ వర్గీకరణ కోసం దేనికైనా సిద్ధమవ్వాలని పిలుపునిచ్చారు. వారసత్వ ప్రదర్శనకు ప్రభుత్వం అనుమతి ఇవ్వకపోవడం బాధాకరమని చెప్పారు. గత 30 ఏళ్లలో ఎమ్మార్పీఎస్ ఉద్యమంలో ఎప్పుడూ శాంతి భద్రతలకు విఘాతం కలగలేదని తెలిపారు. అటు ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో ఎస్సీ వర్గీకరణపై ప్రకటన చేసే ఛాన్స్ ఉంది.