హైదరాబాద్: పదో తరగతి అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు జూన్ 3 నుంచి 13వ తేదీ వరకు జరగనున్నాయి. విద్యార్థులు మే 16లోపు స్కూళ్లలో ఫీజు చెల్లించాలి. ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు పరీక్షలు నిర్వహించనున్నారు. ఒక్కో సబ్జెక్టుకు రీకౌంటింగ్‌కు రూ.500, రీ వెరిఫికేషన్‌కు రూ.1000 చెల్లించాల్సి ఉంటుంది. రీ కౌంటింగ్, రీ వెరిఫికేషన్ ఫలితాల కోసం ఎదురుచూడకుండా సప్లిమెంటరీ పరీక్షలు రాయాలని బోర్డు సూచించింది.
సప్లిమెంటరీ షెడ్యూల్ ఇదే
జూన్ 3న ఫస్ట్ లాంగ్వేజ్ (గ్రూప్-ఏ), ఫస్ట్ లాంగ్వేజ్ పార్ట్ 1,2 (కాంపోజిట్ కోర్సు)
జూన్ 4న సెకండ్ లాంగ్వేజ్
జూన్ 5న థర్డ్ లాంగ్వేజ్
జూన్ 6న మ్యాథ్స్
జూన్ 9న ఫిజికల్ సైన్స్
జూన్ 10న బయోలాజికల్ సైన్స్
జూన్ 11న సోషల్ స్టడీస్
జూన్ 12న ఓఎస్‌ఎస్‌సీ మెయిన్ లాంగ్వేజ్ పేపర్ 1
జూన్ 13న ఓఎస్‌ఎస్‌సీ మెయిన్ లాంగ్వేజ్ పార్ట్ 2
గత నెల 30వ తేదీన తెలంగాణ పదో తరగతి పరీక్ష ఫలితాలు రిలీజ్ అయ్యాయి. రవీంద్రభారతిలో సీఎం రేవంత్‌రెడ్డి ఫలితాలను విడుదల చేశారు. టెన్త్ ఫలితాల్లో 98.2 శాతం ఉత్తీర్ణత నమోదైంది. రెసిడెన్షియల్ స్కూళ్లలో 98.7 శాతంగా ఉత్తీర్ణత నమోదైంది.