హైదరాబాద్: 10వ తరగతి అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ ఫలితాలు విడుదల అయ్యాయి. జూన్ 3వ తేదీ నుంచి 13వ తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా ఈ పరీక్షలు నిర్వహించారు. ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు అధికారులు ఫలితాలను విడుదల చేశారు. ఫలితాల కోసం https://bse.telangana.gov.in/ ను విజిట్ చేయండి. అక్కడ విద్యార్థులు తమ రోల్ నంబర్, ఇతర అవసరమైన వివరాలను నమోదు చేసి ఫలితాలను పొందవచ్చు
10వ తరగతి అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలకు రాష్ట్ర వ్యాప్తంగా 38,741 మంది హాజరయ్యారు. వీరిలో 24,415 మంది ఉత్తీర్ణత సాధించారు. మొత్తంగా 73. 35 శాతం ఉత్తీర్ణత నమోదైంది.
టెన్త్ సప్లిమెంటరీ ఫలితాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.