నిరుద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. రాష్ట్రంలోని అన్ని బీసీ స్టడీ సర్కిళ్లలో ఫిబ్రవరి 15 నుంచి ఆర్‌ఆర్‌బీ, ఎస్‌ఎస్‌సీ, బ్యాంకింగ్ నియామకాల పరీక్షల కోసం 100 రోజుల పాటు ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్టు ప్రకటించింది. ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు ఫిబ్రవరి 9 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థుల తల్లిదండ్రుల వార్షిక ఆదాయం గ్రామీణ ప్రాంతాల్లో రూ.1.50 లక్షలు, పట్టణ ప్రాంతాల్లో రూ.2 లక్షలకు మించకూడదు.
అభ్యర్థులను ఇంటర్, డిగ్రీలో సాధించిన మార్కులు, రిజర్వేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు. ఎంపికైన అభ్యర్థులకు ఫిబ్రవరి 12 నుంచి 14 వరకు సర్టిఫికెట్ వెరిఫికేషన్ చేపట్టనున్నారు. బీసీ స్టడీ సర్కిల్‌లో కోచింగ్ తీసుకోవడం ద్వారా అనుకున్న లక్ష్యాన్ని సాధించడానికి అవకాశం ఉంటుంది. ఇటీవల కాలంలో వరుసగా ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల అవుతున్నాయి. అభ్యర్థులు కోచింగ్ తీసుకోవడం ద్వారా ఏదో ఒక ఉద్యోగం సాధించడానికి అవకాశం ఉంటుంది.