నిర్మల్‌: డ్యాన్స్‌ చేస్తూ యువకుడు మృతి.. వీడియో

పెళ్లి రిసెప్షన్‌లో డ్యాన్స్ చేస్తూ యువకుడు గుండెపోటుతో మృతి చెందిన సంఘటన నిర్మల్‌ జిల్లాలో శనివారం చోటుచేసుకుంది.

By అంజి  Published on  26 Feb 2023 5:15 PM IST
నిర్మల్‌: డ్యాన్స్‌ చేస్తూ యువకుడు మృతి.. వీడియో

ఇటీవల కాలంలో మనుషుల గుండెలు ఉన్న పలంగా ఆగిపోతున్న సంఘటనలు అనేకం జరుగుతున్నాయి. నడుస్తూ, డ్యాన్స్‌ చేస్తూ, వ్యాయామం చేస్తూ, ఇంటి పని చేస్తూ ఒక్కసారిగా కుప్పకూలిపోతున్నారు. అప్పటిదాకా ఎంతో ఉత్సాహంగా ఉండి.. ఒక్కక్షణంలో చనిపోతున్నారు. తాజాగా ఇలాంటి ఘటనే తెలంగాణ రాష్ట్రంలో జరిగింది. పెళ్లి రిసెప్షన్‌లో డ్యాన్స్ చేస్తూ యువకుడు గుండెపోటుతో మృతి చెందిన సంఘటన నిర్మల్‌ జిల్లా కుభీర్ మండలం పార్డి(కె) గ్రామంలో శనివారం చోటుచేసుకుంది.

స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం 19 ఏళ్ల ముత్యం మహారాష్ట్రలోని శుని గ్రామానికి చెందినవాడు. పార్డి (కె) గ్రామంలో జరిగిన రిసెప్షన్ పార్టీలో తెలుగు సినిమా పాటకు డ్యాన్స్ చేస్తూ రాత్రి 7 గంటల ప్రాంతంలో ముత్యం కుప్పకూలిపోయాడు. వెంటనే భైంసాలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు. శుక్రవారం భైంసా మండలం కమోల్ గ్రామంలో స్నేహితుడి వివాహానికి హాజరయ్యాడు. ఈ ఘటనతో ముత్యం ఇంట్లో విషాద ఛాయలు అలుముకున్నాయి.

హైదరాబాద్‌లో నాలుగు రోజుల క్రితం ఓ వివాహ వేడుకలో వరుడికి గంధం రాస్తూ ఓ వ్యక్తి అక్కడికక్కడే కుప్పకూలాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్ అయింది. ఓ యువ కానిస్టేబుల్ జిమ్‌లో కసరత్తులు చేస్తూ.. కుప్పకూలి మృతి చెందాడు.

Next Story