సూర్యాపేట జిల్లాలోని కోదాడ మండలం మంగళతండాలో విషాదం చోటు చేసుకుంది. ఆదివారం నాడు ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయుడు తన ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో ఈ ఘటన జరిగింది. మద్యం మత్తులో సిగరెట్ అంటించుకుని నిద్రమత్తులోకి జారుకొని ఉపాధ్యాయుడు నిద్రలోకి జారుకున్నాడు. ఈ క్రమంలోనే మంచానికి సిగరెట్ మంటలు అంటుకున్నాయి. దీంతో అతను సజీవ దహనం అయ్యాడు. ధరావత్ బాలాజీ (52) ఆదివారం ఉదయం నుండి మద్యం సేవించి వరండాలో నిద్రపోయాడు. అతను సిగరెట్ తాగుతూనే నిద్రపోయాడు.
ఈ క్రమంలోనే ఆ సిగరెట్ మంచానికి అంటుకుంది. దీంతో మంటలు చెలరేగాయని పోలీసులు తెలిపారు. మంటలను చూసిన పొరుగువారు దానిని ఆర్పివేశారు, కానీ అప్పటికే బాలాజీ చనిపోయాడని పోలీసులు తెలిపారు. బాలాజీ నందిగూడెం మండలం చెన్నకేశవపురంలోని ప్రభుత్వ పాఠశాలలో పనిచేశాడు. సంఘటన జరిగిన సమయంలో అతను ఇంట్లో ఒంటరిగా ఉన్నాడు. అతనికి కొన్ని కుటుంబ సమస్యలు ఉన్నాయని, అతని భార్య, పిల్లలు అతనితో నివసించట్లేదని పోలీసులు తెలిపారు.