టీఆర్‌ఎస్ కార్మిక శాఖ మంత్రి సీహెచ్ మల్లారెడ్డి నివాసంతో పాటు పలు ప్రాంతాల్లో ఆదాయపు పన్ను శాఖ అధికారులు దాడులు నిర్వహిస్తున్నారు. ఈ ఉదయం 5.30 గంటలకు సోదాలు ప్రారంభమయ్యాయి.
పన్ను ఎగవేత నిరోధక విభాగానికి చెందిన దాదాపు 50 బృందాలు ఏక కాలంలో పలు చోట్ల తనిఖీల్లో పాల్గొన్నాయి. బోవెన్‌పల్లిలోని మంత్రి నివాసంతో పాటు పలు ప్రాంతాల్లో సోదాలు చేస్తున్నాయి. ఆయన కుమారుడు మహేందర్‌రెడ్డి, అల్లుడుకు సంబంధించిన ఇళ్లు, సంస్థల్లోనూ సోదాలు చేస్తున్నాయి. కొంపల్లిలోని పాం మెడోస్ విల్లాలోనూ సోదాలు చేపట్టారు.
మల్లారెడ్డి.. మల్లా రెడ్డి గ్రూప్ ఆఫ్ కాలేజీలకు చైర్మన్‌గా, కార్మికశాఖ మంత్రిగా ఉన్నారు. కాగా.. గతంలో మల్కాజిగిరి నుంచి ఎంపీగా పోటీ చేసి కాంగ్రెస్ తెలంగాణ ప్రదేశ్ కమిటీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి చేతిలో ఓడిపోయిన ఆయన అల్లుడు రాజశేఖర్‌పై కూడా దాడులు జరిగాయి.