దేశ్ కా ట్రక్ ఉత్సవ్‌లో హైదరాబాద్‌లోని వినియోగదారులకు మరింత వ్యాపార లాభదాయకత

భారతదేశ అతిపెద్ద వాణిజ్య వాహన తయారీ సంస్థ అయిన టాటా మోటార్స్ 2024 October 18న హైదరాబాద్‌లో రోజంతా జరిగేలా దేశ్ కా ట్రక్ ఉత్సవ్ కార్యక్రమాన్ని నిర్వహించనుంది.

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  16 Oct 2024 6:30 PM IST
దేశ్ కా ట్రక్ ఉత్సవ్‌లో హైదరాబాద్‌లోని వినియోగదారులకు మరింత వ్యాపార లాభదాయకత

భారతదేశ అతిపెద్ద వాణిజ్య వాహన తయారీ సంస్థ అయిన టాటా మోటార్స్ 2024 October 18న హైదరాబాద్‌లో రోజంతా జరిగేలా దేశ్ కా ట్రక్ ఉత్సవ్ కార్యక్రమాన్ని నిర్వహించనుంది. ఈ కార్యక్రమం పీపుల్స్ ప్లాజా, హైదరాబాద్‌లోని ట్రక్కింగ్ కమ్యూనిటీని వారికి పనికొచ్చే సూచనలతో బలోపేతం చేయడానికి రూపొందించబడింది. టాటా మోటార్స్ తాజా శ్రేణి ట్రక్కులు, వాల్యూ యాడెడ్ సర్వీసెస్‌తో స్వీయ అనుభవం... ఇవన్నీ కూడా లాభదాయకతను పెంపొందించడం, యాజమాన్యం యొక్క తక్కువ మొత్తం ఖర్చు (TCO)ని అందించడం లక్ష్యంగా ఉన్నాయి.

ఈ కార్యక్రమానికి హాజరయ్యే వారు తమ ఫ్లీట్ పనితీరును మెరుగుపరచడం, ఇంధన సామర్థ్యాన్ని అధికం చేసుకోవడం, ఎక్కువ లాభదాయకతను సాధించడంపై నిపుణుల మార్గదర్శకత్వాన్ని అందుకుంటారు. వారు చక్కటి వివరణలతో కూడిన వాహన ప్రదర్శనలు, టాటా మోటార్స్ సమగ్ర విక్రయానంతర సేవల మద్దతుపై వివరణల నుండి కూడా ప్రయోజనం పొందుతారు. ఇందులో వాహన నిర్వహణ కార్యక్రమాలు, ఫ్లీట్ మేనేజ్‌మెంట్ సొల్యూషన్స్, వార్షిక నిర్వహణ ప్యాకేజీలు, సంపూర్ణ సేవా 2.0 కార్యక్రమం ద్వారా 24/7 రోడ్‌సైడ్ అసిస్టెన్స్ లాంటివి ఉంటాయి. కొనుగోలుదారులకు వారి ఫ్లీట్‌లతో దీర్ఘకాలిక విజయాన్ని అందించడానికి వివరణాత్మక సమాచారాన్ని అందించడానికి వీలుగా ఈ కార్యక్రమం రూపొందించబడింది. అంతేగాకుండా కంపెనీ కీలకమైన కస్టమర్‌లను వారి భాగస్వామ్యం, మద్దతు కోసం గౌరవిస్తుంది. వాహనంతో ఓవరాల్ అనుభవాన్ని మరింత ప్రతిఫలం అందించేదిగా చేస్తుంది.

ఈ సందర్భంగా టాటా మోటార్స్ కమర్షియల్ వెహికల్స్ వైస్ ప్రెసిడెంట్ & బిజినెస్ హెడ్ ( ట్రక్స్) రాజేష్ కౌల్ మాట్లాడుతూ, ‘‘కస్టమర్ల అభివృద్ధి చెందుతున్న అవసరాలను అర్థం చేసుకోవడానికి, పరిష్కరించేందుకు టాటా మోటార్స్ కట్టుబడి ఉంది. దేశ్ కా ట్రక్ ఉత్సవ్ మా తాజా డిజిటల్ సొల్యూషన్స్‌ను హైలైట్ చేస్తూ వారితో నేరుగా నిమగ్నమవ్వడానికి ఒక కీలక వేదికను అంది స్తుంది. ఈ కార్యక్రమం మా పటిష్ఠమైన ట్రక్ శ్రేణి, విలువ-ఆధారిత సేవలను ప్రదర్శించడానికి మాత్రమే కాకుండా, కస్టమర్ల

దీర్ఘకాలిక లాభదాయకత, విజయంపై వారి వాస్తవ-ప్రపంచ ప్రభావాన్ని తెలియజేయడానికి కూడా వీలు కల్పిస్తుంది. మా అత్యాధునిక ఉత్పత్తులు కస్టమర్‌ల వ్యాపారాలను భవిష్యత్తుకు సిద్ధంగా ఉండేలా చేసేందుకు వీలుగా రూపొందించబడ్డాయి. మారుతున్న పరిస్థితులలో అవి ముందుండేలా చేస్తాయి. మా సహకారాన్ని బలోపేతం చేయడానికి, భాగస్వామ్య విజయాన్ని సాధించడానికి మా కస్టమర్లు, భాగస్వాములతో పరస్పర సంభాషణలు చేయడానికి మేం ఎదురుచూస్తున్నాం’’ అని అన్నారు.

ఎల్పీటీ, అల్ట్రా, సిగ్నా, ప్రైమాతో సహా వివిధ క్యాబిన్ ఎంపికలతో విస్తృత శ్రేణి ట్రక్కులను టాటా మోటార్స్ అందిస్తోంది. మార్కెట్ లోడ్, వ్యవసాయం, సిమెంట్, ఇనుము & ఉక్కు, కంటైనర్, పెట్రోలియం, రసాయనం, నీటి ట్యాంకర్లు, ఎల్పీజీ, ఎఫ్ఎంసీజీ, నిర్మాణం, మైనింగ్, చెత్త తరలింపు వంటి వాటితో సహా వస్తువుల తరలింపునకు సంబంధించి విభిన్న అవసరాలను తీర్చడానికి రూపొందించబడిన ఫుల్లీ బిల్ట్ బాడీ ఆప్షన్స్ తో ట్రక్కులు అందుబాటులో ఉన్నాయి. ఈ శ్రేణి సమర్థవంతమైన ఫ్లీట్ మేనేజ్‌మెంట్ కోసం టాటా మోటార్స్ కనెక్ట్ చేయబడిన వెహికల్ ప్లాట్‌ఫామ్‌ ఫ్లీట్ ఎడ్జ్ ను కలిగి ఉంటుంది. మన్నిక కోసం అధునాతన సాంకేతి కతతో రూపొందించబడిన, నిర్దిష్ట కస్టమర్ అవసరాలను తీర్చడానికి కఠినంగా పరీక్షించబడిన ఈ వాహనాలకు టాటా మోటార్స్ విస్తృతమైన నెట్‌వర్క్ మద్దతు ఇస్తుంది. తెలంగాణలో 69 సహా దేశవ్యాప్తంగా 2500 సేల్స్ అండ్ సర్వీస్ టచ్ పాయింట్లతో, కంపెనీ సంపూర్ణ మద్దతు, అత్యధిక స్థాయిలో వాహనం నడిచే సమయాలకు వీలు కల్పిస్తుంది.

Next Story