ప్రజా సేవ కోసం తిరిగి వెళ్తున్నా: తమిళిసై
తెలంగాణ గవర్నర్ పదవికి తమిళిసై సౌందర రాజన్ రాజీనమా చేసిన విషయం తెలిసిందే.
By Srikanth Gundamalla Published on 18 March 2024 6:30 PM ISTప్రజా సేవ కోసం తిరిగి వెళ్తున్నా: తమిళిసై
తెలంగాణ గవర్నర్ పదవికి తమిళిసై సౌందర రాజన్ రాజీనమా చేసిన విషయం తెలిసిందే. ఆమె లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసేందుకు గాను గవర్నర్ పదవికి రాజీనామా చేసినట్లు తెలుస్తోంది. ఇక తమిళనాడులోని ఏదైనా ఒక స్థానం నుంచి లోక్‌సభ ఎన్నికల్లో బరిలో బరిలో నిలిచే అవకాశాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో గవర్నర్ పదవికి రాజీనామా తర్వాత తమిళిసై తిరిగి తమిళనాడుకు పయనం అయ్యారు. శంషాబాద్ ఎయిర్‌పోర్టు నుంచి చెన్నైకి వెళ్తున్న సమయంలో తన రాజీనామాపై తమిళిసై స్పందించి మాట్లాడారు.
ప్రజా సేవ కోసం తిరిగి తమిళనాడు వెళ్తున్నట్లు ఈ సందర్భంగా తమిళిసై చెప్పారు. తెలంగాణ ప్రజలకు ఆమె ధన్యవాదాలు తెలిపారు. తాను ఎప్పటికీ తెలంగాణ సోదరినే అని చెప్పారు. తనపై తెలంగాణ ప్రజలు ఎంతో గౌరవం, ప్రేమాభిమానాలు చూపారని గుర్తు చేసుకున్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ తమిళిసై సౌందర రాజన్ సౌందరరాజన్ ధన్యవాదాలు తెలిపారు. కాగా.. తమిళనాడులోని చెన్నై సెంట్రల్ లేదా.. తూత్తుకూడి ఎంపీ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థిగా తమిళిసై బరిలో నిలిచే అవకాశాలు ఉన్నాయి. లేదంటే పుదుచ్చరి ఎంపీ నియోజకవర్గం నుంచి కూడా పోటీ చేసే చాన్స్ ఉంది. ఇక తమిళిసై లోక్‌సభ ఎన్నికల్లో ఎక్కడి నుంచి పోటీ చేస్తారనేదానిపై త్వరలోనే క్లారిటీ రానుంది.
తమిళిసై సౌందరరాజన్ 2019 సెప్టెంబర్ 8న తెలంగాణ గవర్నర్‌గా నియామకం అయ్యారు. ఆ తర్వాత పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్‌గా కూడా అదనపు బాధ్యతలు తీసుకున్నారు. 20 ఏళ్లకు పైగా సౌందరరాజన్ రాజకీయాల్లో చురుగ్గా పని చేశారు. బీజేపీలో ఆమె క్రియాశీలకంగా పని చేశార. 2019 పార్లమెంట్ ఎన్నికల్లో దక్షిణ చెన్నై పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. అంతకుముందు 2006లో రాధాపురం నియోజకవర్గంలో 2011లో వెలచ్చేరి, 2016లో విరుగంపాక్కం నియోజకవర్గంలో పోటీ చేసి ఓడిపోయారు. అయితే.. బీజేపీ ఈసారి తమిళిసైకి ఎక్కడి నుంచి పోటీ చేసే అవకాశం కల్పిస్తుందో చూడాలి.