బెయిల్‌పై ఉత్కంఠ.. భూమా అఖిల ప్రియ ప్రెగ్నెంట్
Suspense On Bhuma Akhila Priyas Bail. బోయిన్ పల్లిలో మంగళవారం కిడ్నాప్ కు గురైన ప్రవీణ్ రావు సోదరుల కేసులో బెయిల్‌పై ఉత్కంఠ.. భూమా అఖిల ప్రియ ప్రెగ్నెంట్
By Medi Samrat Published on 7 Jan 2021 3:00 PM ISTబోయిన్ పల్లిలో మంగళవారం కిడ్నాప్ కు గురైన ప్రవీణ్ రావు సోదరుల కేసులో టీడీపీ మాజీ మంత్రి భూమా అఖిలప్రియ అరెస్ట్ అయిన సంగతి మనకు తెలిసిందే. ఐటి అధికారులమంటూ ఇంట్లోకి చొరబడి ప్రవీణ్ రావు, సునీల్ రావు, నవీన్ రావు అనే ముగ్గురు అన్నదమ్ములను దుండగులు కిడ్నాప్ చేయడంతో పాటు ల్యాండ్ కు సంబంధించినటువంటి పత్రాలను, ల్యాప్టాప్లను తీసుకెళ్లారు.
ఈ విషయమై కుటుంబ సభ్యులు పోలీసులకు తెలపడంతో వెంటనే కిడ్నాప్ కి గురైన ఆ ముగ్గురు సోదరులను పోలీసులు రక్షించారు. అందులో ప్రవీణ్ రావు పోలీసులకు తెలిపిన ఫిర్యాదులో మాజీ మంత్రి భూమా అఖిలప్రియ, తన భర్త భార్గవ్ పేర్లను నమోదు చేసినట్లు తెలిపారు. దీంతో పోలీసులు మాజీ మంత్రి అఖిల ప్రియను అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు.
కోర్టు అఖిల ప్రియకు 14 రోజుల పాటు రిమాండ్ విధించడంతో.. పోలీసులు ఆమెను చంచల్ గూడ మహిళా జైలుకు తరలించారు. గర్భిణీ కావడంతో పోలీసులు అమెన్ అబ్జర్వేషన్లో ఉంచారు. అయితే.. అఖిలప్రియ రాత్రి ఏమి తినలేదని.. తనకు కొంత అనారోగ్యంగా ఉందని తెలిపారని.. ఇవాళ ఉదయం కొద్దిగా జ్యూస్ మాత్రమే తీసుకున్నారని జైలు అధికారులు తెలిపారు.
ప్రస్తుతం భూమా అఖిలప్రియ ఆరోగ్యం బాగా లేకపోవడం మాత్రమే కాకుండా ప్రస్తుతం ఆమె గర్భవతి కావడంతో ఆమె బెయిల్ పై తీవ్ర ఉత్కంఠత నెలకొంది. మరికాసేపట్లో భూమా అఖిలప్రియ బెయిల్ పిటిషన్ పై సికింద్రాబాద్ కోర్టులో వాదనలు జరగనున్నాయి. అఖిలప్రియ బెయిల్ పిటిషన్ పై పబ్లిక్ ప్రాసిక్యూషన్ కు న్యాయస్థానం మెమోలు జారీ చేసింది. ప్రస్తుతం అఖిలప్రియ చంచల్ గూడ జైలులో రిమాండ్ లో ఉండగా తన భర్త భార్గవ్ పరారీలో ఉన్నారు. భార్గవి కోసం ప్రత్యేక బృందాలతో గాలిస్తున్నట్లు పోలీస్ అధికారులు తెలియజేశారు.