బెట్టింగ్ యాప్స్ ప్రమోష‌న్‌.. తెలంగాణ యూట్యూబర్‌పై కేసు

యూట్యూబర్ బయ్యా సన్నీయాదవ్‌కు బిగ్ షాక్ తగిలింది.

By Knakam Karthik  Published on  12 March 2025 3:16 PM IST
Telangana, Suryapet Police, Youtuber Sunny Yadav, Betting Apps

బెట్టింగ్ యాప్స్ ప్రమోట్..తెలంగాణ యూట్యూబర్‌పై కేసు

యూట్యూబర్ బయ్యా సన్నీయాదవ్‌కు బిగ్ షాక్ తగిలింది. అతడిపై సూర్యాపేట కమిషనరేట్‌లోని నూతంకల్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు అయింది. బెట్టింగ్‌ యాప్స్ ప్రమోట్ చేస్తున్నారంటూ ఓ పోలీసు అధికారి ఫిర్యాదు చేశాడు. దీంతో సన్నీపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.

తన సోషల్ మీడియా అకౌంట్ ద్వారా ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్నారనే ఆరోపణతో సూర్యాపేట పోలీసులు కేసు నమోదు చేశారు. తెలంగాణ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ కూడా ఈ విషయాన్ని లేవనెత్తారు. దీంతో ఆయన ఫిర్యాదుతో సూర్యాపేట కమిషనరేట్‌లోని నూతన్‌కల్ పోలీస్ స్టేషన్‌లో బయ్యా సందీప్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు.

అదే సమయంలో బెట్టింగ్ యాప్‌లను ప్రమోట్ చేస్తున్న వారిపై అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఇటీవలే ఏపీకి చెందిన యూట్యూబర్ నానిపై కేసు నమోదు చేశారు. అతడు బెట్టింగ్ యాప్‌లను ప్రమోట్ చేయడంతో ఈ చర్యలు తీసుకున్నారు. ఇప్పుడు మరో యూట్యూబర్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు.

కాగా సన్నీ యాదవ్ గత కొన్ని సంవత్సరాలుగా ప్రముఖ యూట్యూబర్‌గా ఉంటున్నాడు. బైక్ రైడ్ వీడియోలతో చాలా మంది సబ్‌స్క్రైబర్‌లను పొందుతూ డబ్బు సంపాదిస్తున్నాడు. అయితే అతడు మరింత సంపాదించాలనే ఉద్దేశంతో ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్‌ నిర్వహకులతో కుమ్మక్కయ్యాడని సజ్జనార్ ఆరోపించారు. తక్కువ పెట్టుబడితో సులభంగా డబ్బు సంపాదించాలని ఆసచూపి బెట్టింగ్ యాప్‌లలో పెట్టుబడి పెట్టమని తన సబ్‌స్క్రైబర్‌లను ఆదేశించాడని తెలిపారు. ఇలా బెట్టింగ్ యాప్‌లను ప్రోత్సహించడం ద్వారా.. సన్నీ యాదవ్ యువతను తప్పుదారి పట్టిస్తున్నాడని ఆరోపిస్తూ.. ఇది కొన్ని సందర్భాల్లో ఆత్మహత్యకు దారితీస్తుందని పేర్కొన్నారు.

Next Story