తెలంగాణలో గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా ఎన్నికైన ప్రొఫెసర్ కోదండరాం, అలీఖాన్‌ల నియామకం రద్దు చేస్తూ సుప్రీంకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. తమ అభ్యర్థిత్వాన్ని గవర్నర్ వ్యతిరేకించడం, కొత్తగా వీరిని నియమించడాన్ని సవాల్ చేస్తూ బీఆర్ఎస్ నేత దాసోజే శ్రవణ్, సత్యనారాయణ దాఖలు చేసిన పిటిషన్లపై సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణను సెప్టెంబర్ 17వ తేదీకి వాయిదా వేసింది.
కాగా రెండు ఎమ్మెల్సీ స్థానాలలో తాజా నామినేషన్లు తమ తుది తీర్పునకు లోబడే ఉంటాయని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. దీంతో ఆగస్టు 14,2024 తీర్పులో మార్పులు చేస్తూ సుప్రీంకోర్టు ఉత్తర్వులు ఇచ్చింది.