Telangana: బడులకు రేపే ఆఖరు.. ఎల్లుండి నుంచి సమ్మర్‌ హాలీడేస్‌

ప్రభుత్వ, రెసిడెన్షియల్‌ ప్రైవేట్‌ ఎయిడెడ్‌, అన్‌ ఎయిడెడ్‌ వివిధ యాజమాన్యాల పరిధిలోని పాఠశాలలకు ఈ మంగళవారం

By అంజి  Published on  23 April 2023 7:45 AM IST
Summer vacation, school students, Telangana

Telangana: బడులకు రేపే ఆఖరు.. ఎల్లుండి నుంచి సమ్మర్‌ హాలీడేస్‌

హైదరాబాద్‌: ప్రభుత్వ, రెసిడెన్షియల్‌ ప్రైవేట్‌ ఎయిడెడ్‌, అన్‌ ఎయిడెడ్‌ వివిధ యాజమాన్యాల పరిధిలోని పాఠశాలలకు ఈ మంగళవారం నుంచి వేసవి సెలవులు ప్రారంభం కానున్నాయి. బడులకు సోమవారమే ఆఖరి రోజు. ఏప్రిల్ 25 నుండి జూన్ 11 వరకు సెలవులు ఉంటాయి, వచ్చే విద్యా సంవత్సరానికి జూన్ 12 న పాఠశాలలు తిరిగి తెరవబడతాయి. పాఠశాలల్లో ఇప్పటికే తుది పరీక్షలు పూర్తయ్యాయి, ఏప్రిల్ 24 చివరి పనిదినం. ఇదేరోజు విద్యార్థులకు ప్రోగ్రెస్‌ కార్డులు అందజేస్తారు.

ఈ నేపథ్యంలో సోమవారం జరగనున్న పేరెంట్‌-టీచర్‌ మీటింగ్‌లో పాల్గొనాల్సిందిగా తల్లిదండ్రులందరికీ పాఠశాలలు ఆహ్వానాలు పంపాయి. వచ్చే విద్యా సంవత్సరం ప్రారంభానికి ముందు, జూన్ 1 నుండి ప్రభుత్వ పాఠశాలల్లో బడి-బాట (అడ్మిషన్ డ్రైవ్) ప్రారంభించాలని పాఠశాల విద్యా శాఖ భావిస్తోంది. ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులకే పిల్లలను తమ పాఠశాలల్లో చేర్పించే బాధ్యతను అప్పగించారు. మన ఊరు-మన బడి కార్యక్రమం కింద చేపట్టిన పనులను కూడా వేసవి విరామ సమయంలో పూర్తి చేయాలని ఆ శాఖ యోచిస్తోంది. మొత్తం 48 రోజుల పాటు విద్యార్థులకు వేసవి సెలవులు ఉండనున్నాయి.

Next Story