మెట్ గాలాలో సుధా రెడ్డి మెరుపులు
Sudha Reddy makes Met Gala debut in Falguni Shane Peacock's 'American flag' gown. మెట్ గాలాలో ఈసారి భారత్ కు చెందిన సెలెబ్రిటీలు ఎవరూ
By M.S.R Published on 15 Sept 2021 5:09 PM ISTమెట్ గాలాలో ఈసారి భారత్ కు చెందిన సెలెబ్రిటీలు ఎవరూ కనిపించలేదని అభిమానులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్న తరుణంలో సుధా రెడ్డి తళుక్కున మెరిశారు. హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త మేఘా కృష్ణా రెడ్డి భార్య సుధారెడ్డి న్యూయార్క్‌లో సోమవారం రాత్రి నిర్వహించిన 'మెట్ గాలా-2021'లో కనిపించారు. సుధారెడ్డి ప్రత్యేకంగా డిజైన్ చేసిన గౌనులో మెరిశారు. ఈ ఏడాది థీమ్ అయిన 'అమెరికన్ ఇండిపెండెన్స్'కు తగ్గట్టుగా అమెరికా జెండాలోని రంగులను తలపించేలా భారతీయ డిజైనర్లు తీర్చిదిద్దిన గౌనును సుధారెడ్డి ధరించారు. ఈ గౌను తయారీకి ఏకంగా 250 గంటలు పట్టింది. గతంలో బాలీవుడ్ మహిళా నటులు ప్రియాంక చోప్రా, దీపికా పదుకొనే, ఇషా అంబానీ తదితరులు పాల్గొనగా, ఈ ఏడాది భారత్ నుంచి పాల్గొన్నది మాత్రం సుధారెడ్డి ఒక్కరే. మెట్ గాలాలో పాల్గొనడం ఆమెకు ఇదే తొలిసారి కూడా.
సెలబ్రిటీలు డిజైనర్ వేర్ దుస్తుల్లో మెరిసిపోతూ కనిపించే మెగా ఈవెంట్ 'మెట్ గాలా' రెడ్ కార్పెట్‌పై ప్రపంచం నలుమూలల నుంచీ సెలబ్రిటీలు హొయలు పోతూ ఫొటోలకు ఫోజులిస్తారు. ఈసారి భారత్ నుంచి ఒకే ఒక్క వ్యక్తి పాల్గొన్నారు. ఆమె సుధా రెడ్డి. హైదరాబాదీ మహిళ అయిన ఈమె మేఘా ఇంజినీరింగ్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ డైరెక్టర్ గా కూడా ఉన్నారు. ఈక్రమంలో సుధారెడ్డి ఫస్ట్ టైమ్ 'మెట్ గాలా రెడ్ కార్పెట్'పై తళుక్కుమని మెరిశారు. డిజైనర్ జోడీ ఫాల్గుని, షేన్ పీకాక్ రూపొందించిన గౌన్‌లో సుధారెడ్డి చూపరుల్ని ఆకట్టుకున్నారు. ఆర్ట్, ఫ్యాషన్ అంటే చాలా ఇష్టపడే సుధారెడ్డి ఇలా ఫస్ట్ టైమ్ ఓ అంతర్జాతీయ వేదికపై కనిపించడం విశేషం. నిర్మాణ రంగంలో దేశంలోనే పేరు సాధించిన మేఘా ఇంజనీరింగ్ మరియు ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ డైరెక్టర్ సుధ ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించారు.