ఆర్టీసీ సిబ్బందిపై దాడులకు పాల్పడితే కఠిన చర్యలు: ఎండీ సజ్జనార్‌

నిబద్దత, క్రమ శిక్షణతో విధులు నిర్వర్తిస్తోన్న టీఎస్‌ఆర్టీసీ సిబ్బందిపై విచక్షణరహితంగా దాడులకు దిగడం సమజసం కాదని ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌ అన్నారు.

By అంజి  Published on  10 Jan 2024 8:07 AM GMT
ఆర్టీసీ సిబ్బందిపై దాడులకు పాల్పడితే కఠిన చర్యలు: ఎండీ సజ్జనార్‌

నిబద్దత, క్రమ శిక్షణతో విధులు నిర్వర్తిస్తోన్న టీఎస్‌ఆర్టీసీ సిబ్బందిపై విచక్షణరహితంగా దాడులకు దిగడం సమజసం కాదని ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌ అన్నారు. మహాలక్ష్మి పథకం అమలు తర్వాత సిబ్బందిపై పని ఒత్తిడి పెరిగిందని, అయినా చాలా ఓపిక, సహనంతో వారంతా విధులు నిర్వర్తిస్తున్నారని అన్నారు. ఇలాంటి ఘటనలు సిబ్బందిలో ఆందోళన కలిగిస్తున్నాయన్నారు. ప్రయాణ సమయంలో ప్రతి ఒక్కరూ సిబ్బందికి సహకరించాలని ఆయన కోరారు.

సంగారెడ్డి జిల్లా ఆందోల్‌ లోని ఎంపీడీవో కార్యాలయం దగ్గర మంగళవారం(జనవరి 9) మధ్యాహ్నం ఓ వ్యక్తి బస్సు డ్రైవర్ పై దాడి చేశాడు. బైకర్‌ నిర్లక్ష్యంగా నడపి ప్రమాదానికి కారణమయ్యాడు. అయినా తన తప్పేం లేదన్నట్టు తిరిగి టీఎస్‌ఆర్టీసీ హైర్‌ బస్‌ డ్రైవర్‌పై దాడి చేశారు. దుర్బాషలాడుతూ విచక్షణరహితంగా కొట్టాడు అని ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌ తెలిపారు.

ఇలాంటి దాడులను యాజమాన్యం అసలే సహించదని, ఈ ఘటనపై అందోల్‌ పోలీస్‌ స్టేషన్‌ లో ఫిర్యాదు చేయడం జరిగిందన్నారు. ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసి.. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఆవేశంలో సిబ్బందిపై దాడి చేసి అనవసరంగా ఇబ్బందులకు గురికావొద్దని టీఎస్‌ఆర్టీసీ యాజమాన్యం విజ్ఞప్తి చేస్తోందని సజ్జనార్‌ తెలిపారు. ప్రయాణ సమయంలో ప్రతి ఒక్కరూ సిబ్బందికి సహకరించి.. క్షేమంగా గమ్యస్థానాలకు చేరుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా సహకరించాలని సజ్జనార్ కోరారు.

Next Story