కంటోన్మెంట్ ఆదాయాన్ని రాష్ట్ర ప్రభుత్వం దొంగిలిస్తోంది: రేవంత్ రెడ్డి

మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పై టీపీసీసీ రేవంత్ రెడ్డి ఫైర్ అయ్యారు. మే 10వ తేదీ బుధవారం సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు మీటింగ్

By అంజి  Published on  10 May 2023 4:30 PM IST
Telangana Govt, Talasani srinivas Yadav, cantonment revenue, TPCC chief Revanth Reddy

కంటోన్మెంట్ ఆదాయాన్ని రాష్ట్ర ప్రభుత్వం దొంగిలిస్తోంది: రేవంత్ రెడ్డి

మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పై టీపీసీసీ రేవంత్ రెడ్డి ఫైర్ అయ్యారు. మే 10వ తేదీ బుధవారం సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు మీటింగ్ హాజరైన ఆయన మాట్లాడుతూ తలసాని ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడాలని అన్నారు. బాధ్యతాయుతమైన మంత్రి పదవిలో ఉండి ఇష్టానుసారంగా మాట్లాడితే సరికాదని అన్నారు. తన గురించి ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే సహించేది లేదని హచ్చరించారు రేవంత్ రెడ్డి. పశు కాపరిగా ఉన్నాడు కాబట్టి తలసానికి పేడ పిసకడం అలవాటు అయినట్లుంది.. అందుకే తనను పిసుకుతాను అంటున్నాడని రేవంత్ అన్నారు. పాన్ పరాగ్ లు నమిలే వ్యక్తి తనపై మాట్లాడడం సరికాదని..మంత్రి పదవిలో ఉండి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సిగ్గుచేటన్నారు రేవంత్. కంటోన్మెంట్ బోర్డు మీటింగ్ లో దీర్ఘకాలంగా ఉన్న అంశాలపై బోర్డ్ లో చర్చించామన్నారు. కంటోన్మెంట్ ప్రాంతంలో మూసివేసిన రహదారులను తెరవాలని, నాలా సమస్యలను పరిష్కరించాలని చర్చ జరిగిందని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నుండి కంటోన్మెంట్ కు రావాల్సిన నిధులు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కంటోన్మెంట్ ఆదాయాన్ని రాష్ట్ర ప్రభుత్వం దొంగిలిస్తుందని అన్నారు.

Next Story