ఓటు వేయడానికి జక్కన్న ఎక్కడ నుండి వచ్చారో తెలుసా?

ఎస్ఎస్ రాజమౌళి సోమవారం ఉదయం ఓటు వేయడానికి విదేశాల నుండి హైదరాబాద్ కు చేరుకున్నారు.

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  13 May 2024 11:58 AM IST
ss Rajamouli, Telangana, election, vote,

ఓటు వేయడానికి జక్కన్న ఎక్కడ నుండి వచ్చారో తెలుసా? 

లోక్‌సభ నాలుగో దశ ఎన్నికల సందర్భంగా ఎస్ఎస్ రాజమౌళి సోమవారం ఉదయం ఓటు వేయడానికి విదేశాల నుండి హైదరాబాద్ కు చేరుకున్నారు. చిత్రనిర్మాత తన ఓటు హక్కును వినియోగించుకోవడానికి హైదరాబాద్‌లోని పోలింగ్ స్టేషన్‌ వద్ద క్యూ లైన్ లో చేరడమే కాకుండా.. ఓటు వేసిన తర్వాత భార్య రమా రాజమౌళితో కలిసి తన చిత్రాన్ని కూడా పంచుకున్నారు. హైద‌రాబాద్‌లోని షేక్‌పేట్ ఇంట‌ర్నేష‌న‌ల్ పాఠ‌శాల‌లోని పోలింగ్ బూత్‌కు వెళ్లి ఓటు వేసిన‌ట్లు రాజమౌళి ట్వీట్ చేశారు. నా క‌ర్త‌వ్యం పూర్తయింది. మీరు ఓటు వేశారా? అని ఆయ‌న ప్ర‌శ్నించారు.

నాలుగో దశ పోలింగ్ సోమవారం ఉదయం 7 గంటలకు ప్రారంభమైంది. అన్ని లోక్‌సభ నియోజకవర్గాల్లో సాయంత్రం 6 గంటల వరకు కొనసాగుతుంది. సోమవారం ఉదయం ఆస్కార్ విజేత, సంగీత స్వరకర్త ఎంఎం కీరవాణి హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌లోని పోలింగ్ స్టేషన్‌లో ఓటు వేశారు. ఓటు వేసిన అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. ప్రజాస్వామ్యంలో ఉన్నందున ఓటు వేయాల్సిందేనన్నారు.

Next Story