తెలంగాణలో అందుబాటులోకి వచ్చిన టీ-ఫైబర్

హైదరాబాద్‌లో ఆదివారం జరిగిన ప్రజా విజయోత్సవ కార్యక్రమంలో తెలంగాణ ఐటీ శాఖ మంత్రి డి.శ్రీధర్‌బాబు టీ-ఫైబర్ సేవలను ప్రారంభించారు.

By Kalasani Durgapraveen  Published on  8 Dec 2024 7:45 PM IST
తెలంగాణలో అందుబాటులోకి వచ్చిన టీ-ఫైబర్

హైదరాబాద్‌లో ఆదివారం జరిగిన ప్రజా విజయోత్సవ కార్యక్రమంలో తెలంగాణ ఐటీ శాఖ మంత్రి డి.శ్రీధర్‌బాబు టీ-ఫైబర్ సేవలను ప్రారంభించారు. T-Fiber నెట్ ద్వారా మొబైల్ ఫోన్, కంప్యూటర్, TV లను ఇంటర్నెట్ తో అనుసంధానం చేసుకోవచ్చు. సంగారెడ్డి జిల్లా శ్రీరాంపూర్ గ్రామస్తులను ఉద్దేశించి మంత్రి మాట్లాడారు. అంతేకాకుండా మీసేవా మొబైల్ యాప్‌ను కూడా ప్రారంభించారు. ఈ యాప్ వ్యవసాయ రుణాల మాఫీలు, బోనస్‌లు, ఇతర సంబంధిత సమాచారాన్ని అందిస్తుంది.

తక్కువ ధరకే ఇంటర్నెట్ సదుపాయం కల్పిస్తున్నట్లు మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. పైలట్ ప్రాజెక్టు కింద 3 జిల్లాల్లోని ఒక్కో గ్రామంలో 4 వేల కుటుంబాలకు కేబుల్ టీవీ, ఇంటర్నెట్ సేవలు అందుబాటులోకి వచ్చాయి. పెద్దపల్లి జిల్లా అడవి శ్రీరాంపూర్, సంగారెడ్డి జిల్లా సంఘంపేట, నారాయణపేట్ జిల్లా మద్దూరు గ్రామాల్లో టీ ఫైబర్ నెట్ సర్వీసులు ప్రారంభమయ్యాయి. టీ ఫైబర్‌తో టీవీ, టెలివిజన్, కంప్యూటర్ సేవలకు ఉపయోగం ఉంటుందని మంత్రి తెలిపారు.

Next Story