తెలంగాణలో నిర్వహించిన సామాజిక-ఆర్థిక సర్వే దేశానికి ఆదర్శం కావాలి: ఖర్గే
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ సోషల్ జస్టిస్ ఉద్యమాన్ని ప్రారంభించింది....అని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అన్నారు.
By Knakam Karthik
తెలంగాణలో నిర్వహించిన సామాజిక-ఆర్థిక సర్వే దేశానికి ఆదర్శం కావాలి: ఖర్గే
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ సోషల్ జస్టిస్ ఉద్యమాన్ని ప్రారంభించింది....అని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అన్నారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి రాహుల్‌గాంధీ, ఖర్గేలతో కీలక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఖర్గే మాట్లాడుతూ.. బలహీన వర్గాల కోసం మే ఈ న్యాయ పోరాటం. రాహుల్ గాంధీ నాయకత్వంలో సామాజిక న్యాయం కోసం కాంగ్రెస్ నిరంతర పోరాటం చేస్తుంది. దశాబ్దాలుగా పక్కనబడ్డ ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ వర్గాల ప్రజలకు గళంగా కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుంది. దేశ జనాభాలో మెజారిటీ సంఖ్య అయినా… కార్పొరేట్ బోర్డులు, న్యాయవ్యవస్థ, బ్యూరోక్రసీ, ఉన్నత విద్యా సంస్థల్లో వర్ణహీనత కొనసాగుతోంది. కేంద్ర విశ్వవిద్యాలయాల్లో కూడా అన్యాయం జరుగుతోందని పార్లమెంట్ ఒక ప్రశ్నకు సమాధానంలో ఈ సమాచారం వెల్లడైంది..అని ఖర్గే పేర్కొన్నారు.
80% ఓబీసీ ప్రొఫెసర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. 83% ఎస్టీ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. దేశవ్యాప్తంగా జాతీయ కుల గణాంకాల సమీక్ష జరపాలని కాంగ్రెస్ డిమాండ్ చేస్తోంది. ప్రజల ఒత్తిడికి లోనై కుల గణనకు మోదీ ప్రభుత్వం అంగీకారం తెలిపింది – కానీ 50% రిజర్వేషన్ పరిమితిని తొలగించలేదు. తెలంగాణలో శాస్త్రీయంగా నిర్వహించిన సామాజిక-ఆర్థిక సర్వే దేశానికి ఆదర్శం కావాలి. తెలంగాణ సర్వే ఆధారంగా స్థానిక సంస్థల ఎన్నికలు, విద్యాసంస్థల్లో ఓబీసీలకు 42% రిజర్వేషన్లు సిఫారసు చేస్తాం. ఈ బిల్లు ప్రస్తుతం రాష్ట్రపతి ఆమోదం కోసం ఎదురుచూస్తోంది. ఈ చారిత్రాత్మక ప్రయత్నంలో కృషి చేసిన విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ బి. సుదర్శన్ రెడ్డి నేతృత్వంలోని IEWG బృందానికి కృతజ్ఞతలు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, తెలంగాణ సీఎం, డిప్యూటీ సీఎం, మంత్రిమండలి, ఎంపీలకు ప్రత్యేక అభినందనలు..అని ఖర్గే అన్నారు.