ఉప్పొంగుతున్న వాగులు.. నవ వధువు సహా ఆరుగురు గల్లంతు
Six persons missing in heavy floods.తెలంగాణ రాష్ట్రంలోని పలు జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో వాగులు,
By తోట వంశీ కుమార్ Published on 30 Aug 2021 4:03 AM GMTతెలంగాణ రాష్ట్రంలోని పలు జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో వాగులు, వంకలు పొంగిపోర్లుతున్నాయి. వికారాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో ఆదివారం వాగుల ఉద్ధృతికి ఆరుగురు గల్లంతు కాగా.. మరో ఏడుగురుని స్థానికులు రక్షించారు.
వివరాకి వెళితే.. వికారాబాద్ జిల్లా మర్పల్లి మండలం రావులపల్లికి చెందిన నవాజ్‌రెడ్డికి, మోమిన్ పేట మండలానికి చెందిన ప్రవల్లికతో ఈ నెల 26న వివాహం జరిగింది. ఆదివారం ఒడి బియ్యం పోసుకోవడానికి దంపతులు మోమిన్‌పేటకు వచ్చాయిరు. సాయంత్రం నూతన దంపతులతో పాటు అక్కలు శ్వేత, రాధమ్మ, ఓబాలుడు, బంధువు రాఘవేందర్‌రెడ్డి తో పాటు డ్రైవర్‌తో పాటు కారులో రావులపల్లికి బయలుదేరారు. తిమ్మాపూర్ సమీపంలో వాగు ఉద్దృతంగా ప్రవహిస్తోంది. వాగును దాటేందుకు యత్నించగా.. కారు కొట్టుకుపోయింది. కారు తలుపు తెరుచుకుని బయట పడ్డ నవాజ్‌రెడ్డి, రాధ చేతికి అందిన చెట్ల కొమ్మలు పట్టుకోగా గ్రామస్తులు వారిని రక్షించారు. ప్రవళిక, శ్వేత, ఇషాంత్‌రెడ్డి, రాఘవేందర్‌రెడ్డిలు గల్లంతయ్యారు.
మరో ఘటనలో..
శంకర్‌పల్లి మండలం కొత్తపల్లి వాగులో ప్రమాదవశాత్తు ఓ కారు కొట్టుకుపోయింది. చేవేళ్ల మండలం కౌకుంట్లలో శుభకార్యంలో పాల్గొనేందుకు మోమిన్‌పేట్ మండలం ఎన్నెతల గ్రామానికి చెందిన సామల వెంకటయ్య(70), సాయి, శ్రీనివాస్ వెళ్‌లారు. తిరుగు వచ్చేటప్పుడు బంధువులైన రమేశ్, ఎ.శ్రీనివాస్ కలిసి కారులో వస్తున్నారు. కొత్తపల్లి వద్ద వాగు ఉద్దృతంగా ప్రవహిస్తున్నప్పటికి దాటేందుకు యత్నించారు. ప్రవాహా ఉద్దృతికి కారు కొట్టుకుపోయింది. సాయి, రమేశ్, ఎ.శ్రీనివాస్, ఎస్.శ్రీనివాస్లు సురక్షింతంగా బయటపడ్డారు. దివ్యాంగుడైన వెంకటయ్య కారులోంచి బయటకు రాలేక వాగులో కొట్టుకుపోయాడు.
మరో ఘటనలో నవాబుపేట మండలంలో ఎల్లకొండ నుంచి గొల్లగూడ వెళ్లే మార్గంలో వాగును దాటే ప్రయత్నం చేసిన ఆటో కొట్టుకుపోతుండగా స్థానికులు పక్కనే ఉన్న ట్రాక్టర్‌ను అడ్డంగా నిలిపి ఆటో డ్రైవర్‌ను రక్షించారు. ఇంకో ఘటనలో పుల్‌మామిడి గ్రామం వద్ల పొలం నుంచి ఇంటి వస్తున్న చాకలి శ్రీను(40) వాగులో గల్లంతయ్యారు.