తెలంగాణ హైకోర్టులో కొత్త‌గా ఆరుగురు కొత్త జడ్జిల ప్రమాణస్వీకారం

Six new judges swearing at Telangana High court.తెలంగాణ రాష్ట్ర హైకోర్టులో మంగ‌ళ‌వారం కొత్త‌గా ఆరుగురు జడ్జిలు ప్ర‌మాణ

By తోట‌ వంశీ కుమార్‌  Published on  16 Aug 2022 12:38 PM IST
తెలంగాణ హైకోర్టులో కొత్త‌గా ఆరుగురు కొత్త జడ్జిల ప్రమాణస్వీకారం

తెలంగాణ రాష్ట్ర హైకోర్టులో మంగ‌ళ‌వారం కొత్త‌గా ఆరుగురు జడ్జిలు ప్ర‌మాణ స్వీకారం చేశారు. హైకోర్టు ప్ర‌ధాన న్యాయ‌మూర్తి(సీజే) జ‌స్టిస్ ఉజ్జ‌ల్ భూయాన్ హైకోర్టులోని మొద‌టి హాల్లో కొత్త జ‌డ్జీల‌తో ప్ర‌మాణం చేయించారు. న్యాయమూర్తులుగా ఏనుగుల వెంక‌ట‌ గోపాల్‌, శ్రీనివాసరావు, రాజేశ్వరరావు, నగేష్‌, కార్తీక్‌, శరత్‌లు ప్రమాణం చేసి బాధ్య‌త‌లు స్వీక‌రించారు. నూత‌న న్యాయ‌మూర్తుల‌కు సీజే జ‌స్టిస్ ఉజ్జ‌ల్ భూయాన్ అభినంద‌న‌లు తెలిపారు.

న్యాయవాదుల కోటాలో ఆరుగురు న్యాయమూర్తులు నియామ‌కం అయ్యారు. ఇప్ప‌టి వ‌ర‌కు హైకోర్టులో 28 మంది జ‌డ్జిలు ఉండ‌గా.. కొత్త‌గా వారిలో క‌లిపి ఆసంఖ్య 34 కు చేరింది. రాష్ట్రం ఏర్పాటు అయిన‌ప్పుడు జ‌డ్జిల సంఖ్య 24 ఉండ‌గా.. ఆ త‌రువాత ఆ సంఖ్య‌ను 42 పెంచిన సంగ‌తి తెలిసిందే. ఇంకా ఎనిమిది పోస్టులు ఖాళీగా ఉన్నాయి.

Next Story