Bhadradri: ఎదురు కాల్పులు.. ఆరురుగు మావోయిస్టులు మృతి

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మావోయిస్టులకు, గ్రేహౌండ్స్‌ కు మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో ఆరుగురు మావోయిస్టులు మృతి చెందారు. క

By అంజి  Published on  5 Sept 2024 9:44 AM IST
Maoists killed, counter firing, Bhadradri Kothagudem district, Telangana

Bhadradri: ఎదురు కాల్పులు.. ఆరురుగు మావోయిస్టులు మృతి

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మావోయిస్టులకు, గ్రేహౌండ్స్‌ కు మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో ఆరుగురు మావోయిస్టులు మృతి చెందారు. కరకగూడెం మండలం రఘునాధపాలెం పంచాయితీ పరిధిలోని అటవీ ప్రాంతంలో కాల్పులు జరిగాయి. గ్రేహౌండ్స్ బలగాలకు,లచ్చన్న దళానికి మధ్య ఎదురు కాల్పులు జరగగా.. లచ్చన్నతో సహా దళ సభ్యులు మొత్తం ఆరుగురు మృతి చెందారు.

ఎదురు కాల్పుల్లో ఇద్దరు గ్రేహౌండ్ కానిస్టేబుల్స్‌కు తీవ్ర గాయాలు అయ్యాయి. వారిని మణుగూరు నుండి భద్రాచలం ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తున్నారు. ఈ ప్రాంతంలో గత కొంతకాలంగా మణుగూరు ఏరియా కమిటీ కార్యదర్శి లచ్చన్న దళం కార్యకలాపాలు కొనసాగిస్తోంది. ఛత్తీస్‌ఘడ్ నుంచి వలస వచ్చిన మావోయిస్టు పార్టీకి చెందిన లచ్చన్న నాయకత్వంలో ఈ దళం సంచరిస్తోంది.

ఇదిలా ఉంటే.. ఛత్తీస్‌గఢ్‌లోని దంతెవాడలో మంగళవారం భద్రతా సిబ్బందితో జరిగిన ఎన్‌కౌంటర్‌లో తొమ్మిది మంది నక్సలైట్లు మరణించారు. దంతేవాడ, బీజాపూర్ జిల్లాల సరిహద్దులో నక్సలైట్ల ఉనికిపై నిఘా వర్గాల సమాచారం మేరకు పోలీసులు ఆ ప్రాంతంలో సోదాలు నిర్వహించారు. పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ (PLGA) కంపెనీ నంబర్ 2 నుండి భద్రతా సిబ్బంది - నక్సలైట్ల మధ్య ఎన్‌కౌంటర్ జరిగింది. సెల్ఫ్ లోడింగ్ రైఫిల్ 303, 12 బోర్ గన్‌లతో సహా అనేక ఆయుధాలతో పాటు వారి మృతదేహాలను సంఘటన స్థలం నుండి స్వాధీనం చేసుకున్నారు.

Next Story