ఉపాధి హామీ పనులు చేస్తుండగా కూలీలకు దొరికిన నాణేలు.. ఏ కాలం నాటివంటే..

Silver coins found by laborers while doing nreg works in karimnagar. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం గొల్లపల్లి గ్రామంలో ఉపాధి హామీ పనులు చేస్తుండగా కూలీలకు

By M.S.R  Published on  25 March 2023 10:17 AM GMT
ఉపాధి హామీ పనులు చేస్తుండగా కూలీలకు దొరికిన నాణేలు.. ఏ కాలం నాటివంటే..

Silver coins found by laborers while doing nreg works in karimnagar


కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం గొల్లపల్లి గ్రామంలో ఉపాధి హామీ పనులు చేస్తుండగా కూలీలకు వెండి నాణేలు దొరకడంతో ఈ వార్త చుట్టుపక్కల గ్రామాలకు కూడా పాకిపోయింది. ఉపాధి పనులు చేస్తుండగా.. వారికి రెండు మట్టి కుండలు కనిపించాయి. సంతోషంతో వాటిని తెరిచి చూస్తే అందులో వెండి నాణేలు కనిపించాయి. కూలీలు ఆ నాణేలను పంచుకున్నారు. ఈ విషయం చివరికి అధికారుల దాకా చేరిపోయింది. దీంతో తహసీల్దార్ గ్రామంలో ఉపాధి హామీ పని జరుగుతున్న ప్రదేశానికి చేరుకుని విచారణ చేపట్టారు. నాణేలు ప్రభుత్వానికి అప్పగించాలని కూలీలను తహసీల్దార్ ఆదేశించారు. గురిగిలో దాదాపు 30 వెండి నాణేలు దొరికినట్టు ఉపాధి హామీ కూలీలు చెప్పారు. కూలీల దగ్గర నుంచి నాణేలను స్వాధీనం చేసుకున్న అధికారులు. దొరికిన నాణేలు మీర్ మహబూబ్ అలీ నవాబ్ ఖాన్ కాలంలో 1869 నుంచి 1911 వరకు చలామణిలో ఉన్నట్లు గుర్తించారు.


Next Story