సిద్దిపేట క‌లెక్ట‌ర్ వెంక‌ట్రామిరెడ్డి రాజీనామా..!

Siddipeta collector venkatrami reddy resign to his post. తెలంగాణ రాష్ట్రంలోని సిద్దిపేట జిల్లా కలెక్టర్‌ వెంకట్రామిరెడ్డి రాజీనామా చేశారు. తాత్కాలిక సచివాలయం బీఆర్కే భవన్‌లో ప్రభుత్వ ప్రధాన

By అంజి  Published on  15 Nov 2021 9:30 AM GMT
సిద్దిపేట క‌లెక్ట‌ర్ వెంక‌ట్రామిరెడ్డి రాజీనామా..!

తెలంగాణ రాష్ట్రంలోని సిద్దిపేట జిల్లా కలెక్టర్‌ వెంకట్రామిరెడ్డి రాజీనామా చేశారు. తాత్కాలిక సచివాలయం బీఆర్కే భవన్‌లో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌ కుమార్‌ తన రాజీనామా లేఖను అందించారు. వెంకట్రామిరెడ్డి త్వరలోనే టీఆర్‌ఎస్‌ పార్టీ చేరనున్నట్లు తెలుస్తోంది. కలెక్టర్‌ వెంకట్రామిరెడ్డ గత కొన్ని రోజులుగా రాజీనామా చేస్తారంటూ వచ్చిన ఊహాగానాలు నిజమే అయ్యాయి. అంతా అనుకున్నట్లే వెంకట్రామిరెడ్డి తన పదవికి రాజీనామా చేశారు. వెంకట్రామిరెడ్డి నిర్ణయంతో తెలంగాణ రాజకీయాల్లో చర్చ మొదలైంది. వెంకట్రామిరెడ్డి స్వస్థలం పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం ఇందుర్తి గ్రామం.

ఇటీవల వరి సాగు చేస్తే రైతు ఉరి వేసుకున్నట్లే అన్నట్టు ఆయన చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారం రేగాయి. కిలో వరి విత్తనాలు విక్రయించినా ఊరుకునేది లేదని, వరి విత్తనాలు అమ్మినట్లు తెలిస్తే చర్యలు తప్పవంటూ కలెకర్ట్‌ మాట్లాడారు. బిజినెస్‌ రద్దు చేసి షాపును మూసివేయిస్తామంటూ హెచ్చరించారు. తాను ఉన్నంత కాలం సుప్రీంకోర్టుకు వెళ్లి ఆర్డర్‌ తెచ్చిన షాపు ఓపెన్‌ కాదన్నారు. నేను చెప్పిన దానికి వ్యతిరేకంగా సుప్రీంకోర్టు, రాష్ట్ర హైకోర్టు, ప్రజా ప్రతినిధులు, సీనియర్‌ అధికారులు చెప్పినా ఎట్టి పరిస్థితుల్లోనూ విత్తనాల షాపులు తెరుచుకోవన్నారు. డీలర్లు గనుక విత్తనాలు అమ్మినట్లు తెలిస్తే సంబంధిత ఏఈవోలు, అధికారులను సస్పెండ్‌ చేస్తామని కలెక్టర్‌ వెంకట్రామిరెడ్డి అన్నారు.

Next Story