వైఎస్సార్‌టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల గొప్ప మనసును చాటుకున్నారు. ప్రస్తుతం షర్మిల 'ప్రజా ప్రస్థానం' పేరుతో పాదయాత్ర చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ పాదయాత్ర ప్రస్తుతం నల్లగొండ జిల్లా మర్రిగూడకు చేరుకుంది. మర్రిగూడలోని క్యాంపు కార్యాలయంలో షర్మిల బస చేస్తున్నారు. కాగా.. ఆమె క్యాంపుకు సమీపంలో యాక్సిడెంట్ అయ్యింది. రెండు ద్విచక్రవాహనాలు ఒకదానికొకటి ఢీ కొన్నాయి. ఈ ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులకు గాయాలు అయ్యాయి.
విషయం తెలిసిన వెంటనే షర్మిల స్వయంగా 108 అంబులెన్స్‌కు ఫోన్ చేశారు. అరగంట సమయం పాటు వేచి చూసినా అంబులెన్స్ రాలేదు. దీంతో షర్మిల హుటాహుటిన తన క్వానాయ్‌లోని అంబులెన్స్‌ను ఘటనాస్థలానికి పంపించారు. అందులోనే క్షతగాత్రులని ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం గాయపడ్డ ఇద్దరి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది. షర్మిల చేసిన పనిని స్థానికులు అభినందించారు. కాగా.. అంబులెన్స్ ఆలస్యంపై షర్మిల స్పందిస్తూ.. 108 సేవలు ఎంత అధ్వాన్నంగా ఉన్నాయో అర్థం అవుతుందన్నారు. ప్రజలకు ఉపయోగపడే 108 వాహన సేవలను సీఎం పట్టించుకోవడం లేదని మండిపడ్డారు.