లోకల్‌ ఎన్నికలు ఫస్ట్ ఛాలెంజ్..డీజీపీగా బాధ్యతలు చేపట్టిన శివధర్‌రెడ్డి

తెలంగాణ రాష్ట్ర కొత్త డీజీపీగా సీనియర్ ఐపీఎస్ అధికారి శివధర్ రెడ్డి బాధ్యతలు చేపట్టారు.

By -  Knakam Karthik
Published on : 1 Oct 2025 11:42 AM IST

Telangana, Senior IPS officer Shivdhar Reddy,new DGP of Telangana

లోకల్‌ ఎన్నికలు ఫస్ట్ ఛాలెంజ్..డీజీపీగా బాధ్యతలు చేపట్టిన శివధర్‌రెడ్డి

తెలంగాణ రాష్ట్ర కొత్త డీజీపీగా సీనియర్ ఐపీఎస్ అధికారి శివధర్ రెడ్డి బాధ్యతలు చేపట్టారు. రాష్ట్రానికి ఆరవ డీజీపీగా నియమితులైన ఆయన, బుధవారం ఉదయం లక్డీకాపూల్‌లోని డీజీపీ కార్యాలయంలో పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఈ కార్యక్రమానికి ముందు ఆయన కార్యాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి, పండితుల నుంచి ఆశీర్వచనం తీసుకున్నారు. 1994 ఐపీఎస్ బ్యాచ్‌కు చెందిన శివధర్ రెడ్డి, తొలుత ఆంధ్రప్రదేశ్ క్యాడర్‌లో పనిచేశారు. 2014లో రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఆయన తెలంగాణ క్యాడర్‌కు మారారు.

బాధ్యతల స్వీకరణ అనంతరం డీజీపీ శివధర్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ..డీజీపీ గా నియమించినందుకు తెలంగాణ ప్రభుత్వానికి ధన్యవాదాలు. ఏ లక్ష్యంలో నన్ను నియమించారో అందుకు అనుగుణంగా పనిచేస్తాము. లోకల్ బాడీ ఎన్నికలు మాకు మొదటి చాలెంజ్. శాంతియుతంగా న్నికలు పూర్తి చేయడానికి సన్నద్ధం అవుతున్నాము . పోలీస్ శాఖలో 17000 ఖాళీలు ఉన్నాయి..ఆ నియామకాలు పూర్తి అయ్యేలా చర్యలు తీసుకుంటాం. బేసిక్ పోలీసింగ్ తో సాంకేతికను ఉపయోగించుకుని మరింత సమర్థవంతంగా పని చేస్తాము. మావోయిస్టులు పొలిట్ బ్యూరో మల్లోజుల వేణు గోపాల్ ఇటీవల ఒక ప్రకటన రిలీజ్ చేశారు. బయటకు రావడానికి, ఆయుదాలు వదిలి పెట్టడానికి నిర్ణయం తీసుకున్నాం అని ప్రకటన రిలీజ్ చేశారు. జనరల్ సెక్రటరీ బసవరాజు ఉన్నపుడే ఆ నిర్ణయం జరిగింది.. అని వేణుగోపాల్ ప్రకటనలో పేర్కొన్నారు . వేణుగోపాల్ ఇచిన స్టేట్ మెంట్ జగన్ ఖండించారు . ప్రజా పోరాట పంథా సక్సెస్ అవల్లేదు అని మావోయిస్టులే అంటునారు. పోలీసులు వేధిస్తారని అని భయం లేకుండా ఎలాంటి సంశయం లేకుండా మావోయిస్టుల జన జీవన స్రవంతి లోకి రావాలని విజ్ఞప్తి చేస్తున్నాం. చాలా మంది ఇప్పటికే పార్టీ నుండి బయటకు వస్తున్నారు..రీసెంట్ సెంట్రల్ కమిటీ మెంబర్ సుజాతక్క కూడా లొంగిపోయారు . మావోయిస్టుల లతో మాకు ఇక్కడ సమస్య లేనపుడు వాళ్ళతో చర్చలు అనవసరం..సైబర్ సెక్యూరిటీ, ఈగల్ టీం లకు పూర్తి సహకారం ఉంటుంది.. బేసిక్ పోలింగ్ & విజువల్ పోలీసింగ్ మానిటరింగ్ సిస్టమ్ ఇంప్రూవ్ చేస్తాము. మాకు ఉన్నదంతా ఖాకీ బుక్ ..మాకు పింక్ బుక్కు గురించి తెలియదు.. ఇతరుల వ్యక్తిత్వ హనానికీ పాల్పడేలా సోషల్ మీడియా పోస్టులు పెడితే చర్యలు తీసుకుంటాము..అని డీజీపీ పేర్కొన్నారు.

Next Story