స్కూల్ వ్యాన్ బోల్తా.. 30 మందికి గాయాలు
మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలంలో ప్రమాదం జరిగింది. ప్రైవేటు స్కూల్ బస్సు అదుపు తప్పి బోల్తా పడింది.
By అంజి Published on 25 July 2023 10:28 AM ISTస్కూల్ వ్యాన్ బోల్తా.. 30 మందికి గాయాలు
మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలంలో ప్రమాదం జరిగింది. ప్రైవేటు స్కూల్ బస్సు అదుపు తప్పి బోల్తా పడింది. స్కూల్ నుంచి బయలుదేరిన బస్సు.. కేసముద్రం క్రాస్ రోడ్డు వద్దకు రాగానే అదుపుతప్పి బోల్తాపడింది. ప్రమాదం సమయంలో జరిగిన 30 మంది విద్యార్థులు బస్సులో ఒక్కసారిగా కేకలు వేశారు. ప్రమాదం జరిగిన వెంటనే డ్రైవర్ బస్సు అక్కడినుంచి పరారయ్యాడు. బోల్తా పడడం గమనించిన స్థానికులు స్పందించిన చిన్నారులను బస్సులో నుంచి బయటకు తీసి కాపాడారు. విద్యార్థులందరూ స్వల్ప గాయాలతో సురక్షితంగా బయటపడ్డారు. సెల్‌ఫోన్ మాట్లాడుతూ డ్రైవర్ బస్సు నడిపాడని.. ప్రమాదానికి డ్రైవర్ నిర్లక్ష్యమే కారణమని స్థానికులు ఆరోపిస్తున్నారు.
స్కూల్ ముగిసిన అనంతరం విద్యార్థులను చుట్టు పక్కల గ్రామాల్లోని తమ తమ ఇళ్లకు పంపించేందుకు పిల్లలను బస్సులో ఎక్కించుకొని వెళ్తుండగా మండల కేంద్రంలోని బైపాస్ రోడ్డులో ప్రమాదం జరిగింది. స్కూల్ బస్సును డ్రైవరు అజాగ్రత్తగా నడపడం వల్ల అదుపు తప్పి పక్కన ఉన్న కాలువలో బస్సు బోల్తా పడిందని స్థానికులు చెబుతున్నారు. ఈ సంఘటన సమయంలో బస్సులో 45 మంది విద్యార్థులు ఉండగా 30 మంది విద్యార్థులకు స్వల్ప గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు ఘటనా స్థలానికి చేరుకుని తమ పిల్లలను తీసుకువెళ్లారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని బస్సును బయటకు తీశారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.