Telangana: ఎంపీటీసీ, జడ్పీటీసీల ఎన్నికల నిర్వహణకు షెడ్యూల్ విడుదల

ఎంపీటీసీ, జడ్పీటీసీల ఎన్నికల నిర్వహణకు తెలంగాణ ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది.

By Knakam Karthik
Published on : 31 Aug 2025 11:05 AM IST

Telangana, Local Elections, MPTC and ZPTC elections,

Telangana: ఎంపీటీసీ, జడ్పీటీసీల ఎన్నికల నిర్వహణకు షెడ్యూల్ విడుదల

హైదరాబాద్: ఎంపీటీసీ, జడ్పీటీసీల ఎన్నికల నిర్వహణకు తెలంగాణ ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. సెప్టెంబరు 10వ తేదీ నాటికి ఎంపీటీసీ, జడ్పీటీసీ ఓటర్ల, పోలింగ్ కేంద్రాల తుది జాబితా ప్రచురించాలని ఆదేశిస్తూ కలెక్టర్లకు ఉత్తర్వులు జారీ చేసింది. సెప్టెంబరు 6న ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థానాల వారీగా ఓటర్ల, పోలింగ్ కేంద్రాల ముసాయిదా జాబితాలు ప్రచురించాలి. సెప్టెంబర్ 6 నుంచి 8 వరకు అభ్యంతరాలు, వినతుల స్వీకరించాలి. 8న జిల్లా స్థాయిలో కలెక్టర్లు, మండల స్థాయిలో ఎంపీడీవోలు రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించాలి. 9న అభ్యంతరాలు, వినతులు పరిష్కరించాలి. 10న తుది ఓటర్ల, తుది పోలింగ్ కేంద్రాల జాబితాలు ముద్రించాలి..అని ఉత్తర్వుల్లో పేర్కొంది.

Next Story