హైదరాబాద్ స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నిక షెడ్యూల్ విడుద‌ల‌

హైదరాబాద్ స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికకు ఎన్నికల సంఘం నోటిఫికేషన్ షెడ్యూల్ విడుదల చేసింది.

By Knakam Karthik
Published on : 24 March 2025 12:39 PM IST

Telangana, Hyderabad Local Bodies Quota MLC,  Election Commission, Notification schedule release)

రాష్ట్రంలో మోగిన మరో ఎన్నిక నగారా..ఆ కోటా ఎమ్మెల్సీ నోటిఫికేషన్ రిలీజ్

తెలంగాణలో మరో ఎన్నిక నగారా మోగింది. హైదరాబాద్ స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికకు ఎన్నికల సంఘం నోటిఫికేషన్ షెడ్యూల్ విడుదల చేసింది. ఎమ్మెల్సీ ఎంఎస్‌ ప్రభాకర్‌ పదవీ కాలం మే 1వ తేదీతో ముగియనున్న నేపథ్యంలో ఎన్నికల సంఘం షెడ్యూల్‌ ప్రకటించింది. మార్చి 28న నోటిఫికేషన్‌ విడుదలకానుంది. ఏప్రిల్‌ 4 వరకు నామినేషన్లు దాఖలు చేయవచ్చు. అదే నెల 7న నామినేషన్లను పరిశీలించనున్నారు. నామినేషన్ల ఉపసంహరణకు ఏప్రిల్‌ 9 వరకు గడువు ఉంటుంది. అదే నెల 23న పొలింగ్ నిర్వహించనున్నారు. 25న ఫలితాలు ప్రకటిస్తారు. హైదరాబాద్ జిల్లాల్లో తక్షణమే ఎన్నికల కోడ్ అమలులోకి రానున్నట్లు ఈసీ పేర్కొంది.

నోటిఫికేషన్ షెడ్యూల్:

నోటిఫికేషన్ రిలీజ్: 28 మార్చి 2025

నామినేషన్‌కు చివరి తేదీ: 4 ఏప్రిల్ 2025

నామినేషన్ల పరిశీలన: 7 ఏప్రిల్ 2025

నామినేషన్ల ఉపసంహరణకు ఆఖరు గడువు: 9 ఏప్రిల్ 2025

పోలింగ్ తేదీ: 23 ఏప్రిల్ 2025

ఓట్ల లెక్కింపు: 25 ఏప్రిల్ ౨౦౨౫

Next Story