హైదరాబాద్: సైబర్ నేరగాళ్లు రోజురోజుకీ రెచ్చిపోతున్నారు. మరీ ముఖ్యంగా వీఐపీలను టార్గెట్‌గా చేసుకుని, వాళ్ళ డీపీలను ఉపయోగిస్తూ మోసాలకు పాల్పడుతున్నారు. గతంలో ఎంతోమంది ఐపీఎస్ అధికారుల ఫేక్ ఐడీ, డీపీలను సృష్టించి సైబర్ నేరగాళ్లు మోసాలకు పాల్పడిన విషయం తెలిసిందే. తాజాగా తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) శాంతి కుమారి డీపీని ఉపయోగించి మోసాలకు పాల్పడుతున్నారు.
సీఎస్ శాంతి కుమారి ఫొటోను డీపీగా ఉంచి పలువురికి మేసేజ్‌లు, ఫోన్లు చేస్తున్నారు. మోసాలను గుర్తించిన సీఎస్ తక్షణమే సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్, టీఎస్‌సీఎస్‌బీ (టీఎస్ సైబర్ సెక్యూరిటీ బ్యూరో)లో ఫిర్యాదు చేశారు. సీఎస్ ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. 9844013103 నెంబర్ ద్వారా ఫోన్లు చేసి మోసాలకు పాల్పడుతున్నట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు.