Sangareddy: ఇంటి తలుపులకు కరెంట్‌ సరఫరా చేసి.. కుటుంబాన్ని చంపేందుకు యత్నం

సంగారెడ్డి జిల్లాలో దారుణ ఘటన వెలుగు చూసింది. నారాయణఖేడ్ మండలం సంజీవరావుపేట గ్రామంలో శుక్రవారం తెల్లవారుజామున కొందరు

By అంజి  Published on  16 April 2023 9:00 AM IST
Sangareddy, Crime news, Sanjeeva Raopet village

Sangareddy: ఇంటి తలుపులకు కరెంట్‌ సరఫరా చేసి.. కుటుంబాన్ని చంపేందుకు యత్నం

సంగారెడ్డి జిల్లాలో దారుణ ఘటన వెలుగు చూసింది. నారాయణఖేడ్ మండలం సంజీవరావుపేట గ్రామంలో శుక్రవారం తెల్లవారుజామున కొందరు గుర్తుతెలియని దుండగులు ఇంటి తలుపులకు విద్యుత్ సరఫరా చేసి హత్యాయత్నానికి పాల్పడ్డారు. నారాయణఖేడ్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రైతు ధనియాల రాములు తన ఇంట్లో భార్య, కూతురు, మనవరాలితో కలిసి నిద్రిస్తున్నాడు. శుక్రవారం తెల్లవారుజామున కుమార్తె నిద్ర లేచి తలుపులు తీయగా, విద్యుత్ షాక్‌కు గురై కిందపడిపోయింది.

రాములు భార్య ఆమెను రక్షించడానికి వచ్చి తలుపు తాకడంతో ఆమె కూడా విద్యుత్ షాక్‌కు గురైంది. సహాయం కోసం కుటుంబీకులు కేకలు వేయడంతో ఇరుగుపొరుగు వారు వచ్చి చూడగా తలుపులు కరెంట్ సరఫరా చేయడంతో కనిపించింది. అదే రోజు రాత్రి అతని వ్యవసాయ పొలంలో ఉన్న బోర్‌వెల్ పంపుల స్టార్టర్లను కూడా దుండగులు తగులబెట్టారు. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. దుండగులు కావాలనే కుటుంబాన్ని హత్య చేసేందుకు ప్లాన్‌ చేసినట్లు పోలీసులు ప్రాథమికంగా భావిస్తున్నారు.

Next Story