కన్యాకుమారిలో రోడ్డు ప్రమాదం.. మంచిర్యాల దంపతుల మృతి

గురువారం సాయంత్రం తమిళనాడులోని కన్యాకుమారి పట్టణంలో రోడ్డు దాటుతుండగా గుర్తుతెలియని వాహనం ఢీకొనడంతో...

By -  అంజి
Published on : 16 Jan 2026 12:29 PM IST

Sabarimala pilgrim couple, Mancherial, killed, accident, Tamil Nadu

కన్యాకుమారిలో రోడ్డు ప్రమాదం.. మంచిర్యాల దంపతుల మృతి

గురువారం సాయంత్రం తమిళనాడులోని కన్యాకుమారి పట్టణంలో రోడ్డు దాటుతుండగా గుర్తుతెలియని వాహనం ఢీకొనడంతో మంచిర్యాలలోని లక్సెట్టిపేట పట్టణానికి చెందిన దంపతులు అక్కడికక్కడే మృతి చెందారు. కేరళలోని శబరిమల యాత్రకు వెళ్లి వస్తుండగా ఈ ఘటన జరిగింది. కుటుంబ సభ్యులు, పోలీసుల కథనం ప్రకారం, కన్యాకుమారి పట్టణ శివార్లలో రాత్రి 9 గంటల ప్రాంతంలో రోడ్డు దాటుతుండగా జరిగిన ప్రమాదంలో కిరాణా దుకాణం యజమాని కలకుర్తి సత్యనారాయణ (63)m అతని భార్య రమాదేవి (59) తీవ్రంగా గాయపడ్డారు. వారు శబరిలోని అయ్యప్ప స్వామి ఆలయాన్ని సందర్శించి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది.

ఈ ఘటనలో వారి ఇద్దరు కుమార్తెలు ప్రాణాలతో బయటపడ్డారు. జనవరి 6న ఆ జంట అయ్యప్ప భక్తులతో కలిసి ప్రైవేట్ బస్సు అద్దెకు తీసుకుని తీర్థయాత్రకు బయలుదేరారు. వారు ప్రసిద్ధ అయ్యప్ప ఆలయంలో దర్శనం చేసుకుని మంచిర్యాలకు తిరిగి వెళ్తున్నారు. కన్యాకుమారిలోని పర్యాటక ప్రదేశాలు, దేవాలయాలను సందర్శించడానికి కొద్దిసేపు ఆగారు. గుర్తు తెలియని వాహనం డ్రైవర్ పై హిట్ అండ్ రన్ కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మృతదేహాలను లక్సెట్టిపేట్ పట్టణానికి తరలిస్తున్నారు.

Next Story