కాంగ్రెస్‌కు మద్దతు ప్రకటించిన ఆర్టీసీ తెలంగాణ మజ్దూర్ యూనియన్

తెలంగాణ రాష్ట్రంలో రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఆర్టీసీ తెలంగాణ మజ్దూర్ యూనియన్ స్వచ్చందంగా

By Medi Samrat  Published on  27 Nov 2023 1:43 PM IST
కాంగ్రెస్‌కు మద్దతు ప్రకటించిన ఆర్టీసీ తెలంగాణ మజ్దూర్ యూనియన్

తెలంగాణ రాష్ట్రంలో రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఆర్టీసీ తెలంగాణ మజ్దూర్ యూనియన్ స్వచ్చందంగా కాంగ్రెస్ పార్టీకి మద్దతును ప్రకటిస్తున్నట్లు ఆర్టీసీ టీఎంయూ నాయకుడు అశ్వద్దామరెడ్డి ప్రకటించారు. ఖైరతాబాద్ ప్రెస్ క్లబ్‌లో జరిగిన సమావేశంలో ఆయ‌న మాట్లాడుతూ.. రానున్న ఎన్నికల్లో ఆర్టీసీ ఉద్యోగులతో పాటు వారి కుటుంబ సభ్యులు, బంధువులు అందరూ కూడా కాంగ్రెస్‌ను భారీ మెజార్టీతో గెలిపించాలని సూచించారు.

అనంతరం టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్, కేంద్ర మాజీ మంత్రి జైరాం రమేష్ లను కలిసి వారి నిర్ణయాన్ని ప్రకటించారు. ఈ నిర్ణయం పట్ల జైరాం రమేష్.. అశ్వద్ధామ రెడ్డితో పాటు ఆర్టీసీ నాయకులను అభినందించారు. ఆర్టీసీ కార్మికుల పట్ల కాంగ్రెస్ పార్టీ రానున్న ప్రభుత్వంలో ప్రత్యేక కార్యాచరణతో ముందుకు సాగి.. ఉద్యోగుల భద్రత తదితర అంశాలకు సంబంధించి యూనియన్ల ఇష్టం మేరకు నిర్ణయాలు తీసుకోబోతుందని ప్రకటించారు.

Next Story