చిన్నారి అదృష్టం బావుంది..అందరికీ ఇలా ఉండదు: రోడ్ సేఫ్టీపై సజ్జనార్
డ్ సేఫ్టీపైనా అవగాహన కల్పిస్తూ సజ్జనార్ ఓ వీడియోను పోస్టు చేశారు. ఆ వీడియోలో ఓ చిన్నారి రోడ్డు ప్రమాదంలో పడుతుంది.
By Srikanth Gundamalla Published on 19 Jun 2023 5:35 AM GMTచిన్నారి అదృష్టం బావుంది..అందరికీ ఇలా ఉండదు: రోడ్ సేఫ్టీపై సజ్జనార్
తెలంగాణ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటారు. ఆర్టీసీ సంస్థ చేపడుతున్న కార్యక్రమాలను ఆయన ట్విట్టర్ ద్వారా ప్రజలతో పంచుకుంటుంటారు. ఈ క్రమంలో రోడ్ సేఫ్టీపైనా అవగాహన కల్పిస్తూ సజ్జనార్ ఓ వీడియోను పోస్టు చేశారు. ఆ వీడియోలో ఓ చిన్నారి రోడ్డు ప్రమాదంలో పడుతుంది. కానీ.. అమ్మాయి అదృష్టం బాగుండి.. పెను ప్రమాదాల నుంచి తృటిలో తప్పించుకుంటుంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
రోడ్డుప్రమాదాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. కొందరు నిర్లక్ష్యంగా డ్రైవ్ చేస్తూ అవతలి వారి ప్రాణాలను బలి తీసుకుంటున్నారు. ఇంకొందరైతే ఏకంగా డ్రంకెన్ డ్రైవ్‌తో ప్రమాదాల బారిన పడుతున్నారు. ఇక చిన్నపిల్లలకు రోడ్డుప్రమాదాలపై ఏం అవగాహన ఉంటుంది చెప్పండి.. తల్లిదండ్రుల వెంట బయటకు వెళ్లినప్పుడు అటూ ఇటూ పరిగెడుతుంటారు. వారిని ఆ సమయంలో ఎప్పుడూ కనిపెట్టుకుని ఉండాలి. వారిని కొంచెం మరిచినా అంతే సంగతులు. తాజాగా రోడ్డు ప్రమాదాలపై అవగాహన కల్పిస్తూ తెలంగాణ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ఓ వీడియోను ట్విట్టర్‌లో షేర్ చేశారు. ఎక్కడ జరిగిందో తెలియదు కానీ.. వీడియో వాహనాలు చాలా వేగంగా తిరుగుతున్నాయి. ఉన్నట్లుండి ఓ చిన్నారి రోడ్డు మీదకు పరుగు తీసింది. యుముడు పంపినట్లుగా ఒక బైక్ జెట్ స్పీడ్‌తో చిన్నారిని స్వల్పంగా ఢీకొట్టింది. దీంతో ఆ పాప రోడ్డుపై పడిపోతుంది. ఆ వెంట వెంటనే మరో రెండు బైకులు చిన్నారికి అతిదగ్గరగా వెళ్లిపోయాయి. కానీ చిన్నారిని మాత్రం ఏం కాలేదు. వరుస ప్రమాదాల నుంచి ప్రాణాలతో బయటపడింది. ఈ షాకింగ్ వీడియో చూసిన నెటిజన్లు కూడా ఆశ్చర్యపోతున్నారు.
ఈ సందర్భంగా ఆర్టీసీ ఎండీ సజ్జనార్.. పిల్లలను బయటకు తీసుకెళ్లినప్పుడు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా వారి ప్రాణాలకే ప్రమాదం వాటిల్లే అవకాశం ఉంటుందని రాసుకొచ్చారు. అందరికీ ఈ చిన్నారిలా అదృష్టం వరించదని ట్విట్టర్‌లో క్యాప్షన్ ఇచ్చారు.