ప్రయాణికుల కోసం.. మైసమ్మ దేవత పాట పాడిన ఆర్టీసీ డ్రైవర్ శాంతయ్య.. సజ్జనార్ ఏమన్నారంటే.!
RTC driver Shantayya attracting passengers with song. బస్సుల్లో ప్రయాణికుల సంఖ్యను పెంచేందుకు తెలంగాణ ఆర్టీసీ అనేక చర్యలు చేపట్టింది. ఇక ఆర్టీసీ ఎండీగా సజ్జనార్ బాధ్యతలు
By అంజి
బస్సుల్లో ప్రయాణికుల సంఖ్యను పెంచేందుకు తెలంగాణ ఆర్టీసీ అనేక చర్యలు చేపట్టింది. ఇక ఆర్టీసీ ఎండీగా సజ్జనార్ బాధ్యతలు చేపట్టిన నాటి నుండి.. ఆయన ఆర్టీసీ గాడిలో పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. గత కొన్ని రోజులగా తెలంగాణ ఆర్టీసీ ప్రయాణికులను ఆకట్టుకునేలా అనేక కార్యక్రమాలు అమలు చేస్తోంది. దీంతో ఆర్టీసీకి కొంత ఆదాయం పెరిగినట్లు తెలుస్తోంది. ప్రతి ఊరికి ఆర్టీసీ సేవలు అందేలా చూస్తున్నారు. ఇక నిన్న నేషనల్ చిల్డ్రన్స్ డే సందర్భంగా 15 ఏళ్ల లోపు పిల్లలకు ఉచిత ప్రయాణం కల్పించారు. వివాహాలకు ఆర్టీసీ బస్సులను బుక్ చేసుకుంటే.. కొత్త పెళ్లి జంటకు కానుకలను అందిస్తోంది టీఎస్ ఆర్టీసీ. వినూత్నమైన కార్యక్రమాలను చేపడుతూ ప్రజలకు దగ్గరవుతోంది. ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం సురక్షితం అంటూ ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు.
తాజాగా నాగర్‌కర్నూలు డిపోకు చెందిన డ్రైవర్ శాంతయ్య ప్రయాణికులను ఆకర్షించేందుకు ఓ పాట పాడారు. జిల్లాలోని పెద్దకొత్తపల్లి మండలం పరిధిలో నాయినిపల్లి మైసమ్మ ఆలయం ఉంది. ఈ ఆలయానికి ప్రతి ఆదివారం పెద్ద సంఖ్యలో భక్తులు అమ్మవారిని దర్శించుకునేందుకు వస్తుంటారు. ఈ నేపథ్యంలోనే వనపర్తి, కొల్లాపూర్, నాగర్‌కర్నూలు డిపోల నుండి నాయినిపల్లి మైసమ్మ ఆలయానికి ప్రత్యేక బస్సులు నడిపిస్తారు. ఈ క్రమంలోనే డ్రైవర్ శాంతయ్య.. మైసమ్మ జాతరకు వచ్చే ప్రయాణికులను ఆకర్షించేందుకు పాట పాడారు. మైసమ్మ దేవత గురించి తెలుపుతూ ఓ అద్భుతమైన పాటను పాడారు. దీంతో పాటు ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం చేద్దామంటూ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియోను ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ తన ట్విటర్‌లో పోస్టు చేశారు.
Promoting #PublicTransport By Sri Shanthaiah Driver, #Nagarkurnool depot #TSRTC #Hyderabad #IchooseTSRTC @puvvada_ajay @Govardhan_MLA @TSRTCHQ @VChelamela @SpNagarkurnool @TV9Telugu @sakshinews @V6News @way2_news @rpbreakingnews @AsianetNewsTL @ANI @PIBHyderabad @IPRTelangana pic.twitter.com/H6RO0NAmKy
— V.C Sajjanar IPS MD TSRTC Office (@tsrtcmdoffice) November 15, 2021